చాలామంది విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం తహతహలాడుతుంటారు. అక్కడ జీతాలు ఎక్కువని అందరూ అటువైపు వెళుతుంటారు. అమెరికా, దుబాయ్, కెనడా, లండన్ ఇలా ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. తాజాగా ఓ టెకీ దుబాయ్ లో జాబ్ దొరికిందని వెళ్లాలా వద్దా అని నెటిజన్లను అడుగుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అతని పోస్ట్ ప్రకారం చూసినట్లయితే.. ఆ టెకికీ దుబాయ్ నుంచి తనకు ఏడాదికి రూ.50 లక్షల ఉద్యోగ ఆఫర్ వచ్చిందని తెలిపాడు. అలాగే భారత్ నుండి కూడా రూ.33 లక్షలు ఆఫర్ వచ్చిందని కూడా భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తెలిపాడు. అయితే దేనికి వెళ్లాలో సందిగ్థ పరిస్థితులలో ఉన్నానని చెప్పుకొచ్చాడు.
రెడ్డిట్‌పై ఆయన పెట్టిన పోస్ట్ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. 6 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ బ్యాకెండ్ డెవలపర్‌కు ఇండియాలోనే సంవత్సరానికి రూ. 33 లక్షల ఆఫర్ ఉంది. కానీ అతనికి దుబాయ్ నుండి కూడా రూ. 50 లక్షల ఆఫర్ వచ్చింది. ఏది తీసుకోవాలో సందిగ్ధంలో ఉన్న అతనిని నెటిజన్లు ఇచ్చిన సలహాలు మరింతగా ఆందోళనకు గురిచేశాయి. దుబాయ్ చాలా ఖరీదైనది..సంవత్సరానికి రూ. 50 లక్షలు (పన్నుకు ముందు) ఇస్తుంది కాని దుబాయ్ ప్యాకేజీ అతనికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులను మాత్రమే అందిస్తుంది. కానీ నివసించడానికి ఇల్లు లేదా కుటుంబానికి బీమా లేదని ఓ నెటిజన్ తెలిపాడు.

మరొక నెటిజన్ దుబాయ్ జీతాలు భారతీయ ఆఫర్ల కంటే కాగితంపై ఎక్కువగా అనిపించవచ్చు కాని లోతుగా చూస్తూ ఇవి చాలా తక్కువన్నారు. అలాగే దేశం ఇచ్చిన ఆఫర్ దుబాయ్ జీతం (సంవత్సరానికి 33 లక్షలు) కంటే తక్కువ కావొచ్చు. కానీ దానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇండియాలో అయితే ఆఫీసుతో పాటుగా ఇంటి నుండి కూడా పని చేసుకోవచ్చన్నారు.
అలాగే మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు కూడా భీమా వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే జీవితం కూడా అందరి మధ్యన గడుపుతూ హాయిగా ఉండవచ్చు అని సలహా ఇచ్చారు. నువ్వు ఒంటరిగా బతకాలనుకుంటే దుబాయ్ సరిపోతుంది. ఇక కుటుంబంతో హాయిగా గడపాలనుకుంటే నీకు ఇండియా సరిపోతుందని మరొక నెటిజన్ సలహా ఇచ్చారు. నీవు సింగిల్ గా ఉంటే నెలకు లక్ష రూపాయలతో దుబాయ్ లో ఎంజాయ్ చేస్తూ గడిపేయవచ్చు. అదే ఇండియాలో అదే లక్షతో కుటుంబంతో పాటు హాయిగా గడపవచ్చని తెలిపారు.
మరొక నెటిజన్ ఏమన్నారంటే.. ఇల్లు లేకుండా దుబాయ్‌లో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతుంది. మీరు దుబాయ్‌కి వెళ్లాలనుకుంటే ముందుగా నివసించడానికి స్థలం అడగండి.. లేకపోతే మొత్తం జీతం అద్దెకు పోతుందని సలహా ఇచ్చాడు. మరికొందరు దుబాయ్ ద్రవ్యోల్బణం (ముఖ్యంగా అద్దె, పిల్లల విద్య, కుటుంబ ఖర్చులు), భారతదేశంలో లభించే అదనపు ప్రయోజనాలను (భీమా, పని-జీవిత సమతుల్యత) పూర్తిగా లెక్కించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
ఈ టెక్ ప్రొఫెషనల్ స్టోరీ విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఒక పాఠంగా చెప్పుకోవచ్చు. పెద్ద జీతం ఎల్లప్పుడూ మెరుగైన జీవితానికి హామీ ఇవ్వదని కొందరు చెప్పగా.. కుటుంబం లేకుండా నీవు ఎంతో దూరంలో ఉండి ఎక్కువ సంపాదించినా వేస్ట్ అని చెప్పుకొచ్చారు. కేవలం డబ్బు మీద కాకుండా జీవితం మీద కూడా ఆలోచన చేయాలని ఈ కథ అందరికీ చెబుతోంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఇరాన్ దాడుల తర్వాత దుబాయ్ తిరిగి సాధారణ స్థితికి.. నేడు మార్కెట్లు ఓపెన్.. తగ్గిన సంక్షోభం ప్రభావం..

UAN మర్చిపోయారా? టెన్షన్ వద్దు… ఇలా PF బ్యాలెన్స్ చెక్ చేయండి..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications