ఇటీవల ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తనకు కంపెనీలో జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. ఇది చాలా మంది సాంకేతిక ఉద్యోగులు, సంస్థల మేనేజ్మెంట్, సాధారణ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఆ ఇంజనీర్ ఆరు సంవత్సరాలుగా ప్రముఖ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ డ్రాప్‌బాక్స్ వంటి సేవలకు మద్దతుగా పని చేస్తున్నాడు. వివిధ పరికరాల్లో ఫైళ్లు సమకాలీకరణం అయ్యేలా చేయడంతో అతని పని చాలా కీలకంగా మారింది. ఈ వ్యవస్థ యూజర్‌లు ఎక్కడైనా ఉన్నా వారి ఫైళ్లు మారకుండా, నిరంతరంగా అందుబాటులో ఉండేలా చూసుకుంటుంది. సాంకేతికంగా సంక్లిష్టమైన అల్గోరిథంలను ఉపయోగించి ఈ పని చేయడం కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఇది సేవల స్థిరత్వానికి మూలమైన పనిగా చెప్పవచ్చు.
అయితే ఈ వ్యవస్థను నడిపించేందుకు సరిపడా బృందం లేకపోవడంతో.. అతను ఒంటరిగా ఈ బాధ్యతను నిర్వహించాడు.అయితే అంత కష్టపడి పని చేసినప్పటికీ.. అతని జీతం ఇతర సీనియర్ సహోద్యోగుల కంటే దాదాపు 10 శాతం తక్కువగా ఉండటం అతని దృష్టికి వచ్చింది.ఈ విషయం కంపెనీని అడిగాడు. జీతం పెంచమని కోరాడు. అయితే కంపెనీ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో ఆ ఇంజనీర్ నిర్ణయించిన విధంగా అధికారిక కార్యాలయ షెడ్యూల్‌ను పట్టించుకోవడం మానేసి, తన స్వంత ఆలోచన ప్రకారం పని చేయడం ప్రారంభించాడు. టైంకి రావడం అలాగే టైంకి వెళ్లడం వంటివి చేస్తూ పనిని పూర్తిగా ఇంతకు మందులాగా పట్టించుకోవడం మానేశాడు.

ఆ కంపెనీకి కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత అతని మేనేజర్‌ను తొలగించి.. నేరుగా అతని పర్యవేక్షణలో ఉంచారు. డైరెక్టర్ కొద్ది కాలంలో పని సరిగా చేయడం లేదనే కారణంతో అతన్ని తొలగించాలని నిర్ణయించాడు. ఇది అస్పష్టమైన కారణంతో జరిగిందిజ కంపెనీ ఈ చర్యకు స్పష్టమైన వివరణ కూడా అతనికి ఇవ్వలేదు. ఆ తరువాత కంపెనీ యాజమాన్యం అటువంటి నిర్ణయం తీసుకున్న డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్‌ను నిందించింది. వారిని పదవి నుండి తొలగించింది. సంస్థ ఆ ఒక్కడి పని కోసం ఆరుగురు కొత్త ఉద్యోగులను నియమించాల్సి వచ్చింది. అంటే ఇంజనీర్ ఒంటరిగా చేస్తున్న పని ఇప్పుడు ఆరుగురు చేతుల్లో విభజించడం జరిగింది. ఇది పెద్ద వ్యయాన్ని మాత్రమే కాకుండా..ఇది సంస్థలో నమ్మకాన్ని కూడా ధ్వంసం చేసింది.
ఈ మార్పులు ప్రామాణికతపై తీవ్ర ప్రభావం చూపాయి. కోడ్ లో బగ్‌లు పెరిగాయి, కస్టమర్లు ఆ ప్లాట్‌ఫామ్‌ను వదిలేసి ప్రత్యామ్నాయ సేవలకు వెళ్లిపోయారు, పెట్టుబడిదారులు సంస్థపై నమ్మకాన్ని కోల్పోయారు. కొన్నిసార్లు న్యాయం ఆలస్యంగా అయినా గెలుస్తుంది" అనే అనుభూతిని ఇంజనీర్ వ్యక్తిగతంగా పేర్కొంటున్నారు. అతను తను న్యాయంగా పని చేసినా, తక్కువ జీతంతో పని చేసిన తన ప్రతిభను తక్కువగా అంచనా వేయడం వల్ల కంపెనీకి ఎంత పెద్ద నష్టం వచ్చిందో ఈ సంఘటన స్పష్టం చేసిందని చెప్పుకొచ్చాడు.
ఈ Techie కథ ఉద్యోగులకు, మేనేజ్మెంట్‌కు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ప్రత్యేకమైన ప్రతిభను సరైన విలువతో గౌరవించకపోవడం, న్యాయసమ్మతమైన జీతాలను నిరాకరించడం ఎంత పెద్ద సమస్యలకు దారితీస్తుందో అందరికి స్పష్టంగా తెలియజేస్తోంది. దీని ద్వారా సంస్థలు తక్కువ ఖర్చు కోసమే నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తక్కువగా అంచనా వేయడం అనర్థకమని, ఇది తాము నిర్మించిన వ్యాపార పరిపాటికి నష్టమే అని మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications