IT News: టెక్ దిగ్గజం టీసీఎస్‌కూ విప్రో, ఇన్ఫోసిస్ సమస్యే.. టెక్ కంపెనీలకు ఏమైంది..?
TCS News: ఇటీవల అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు స్వల్పంగా కుదుటపడటంతో ఐటీ సేవల కంపెనీలోని సంస్థలు తేరుకుంటున్నాయి. వ్యాపారాలు ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతున్న వేళ వాటికి నాయకత్వ స్థాయిలో పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇది కంపెనీలో ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
దేశీయ టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వరుస నిష్క్రమణల వేడి టాటాలకు చెందిన ఐటీ సేవల దిగ్గజ సంస్థ టీసీఎస ను సైతం తాకింది. ఇప్పటి వరకు ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ టెక్ కంపెనీలు భారీగా ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణలను చూసిన సంగతి తెలిసిందే. తర్వాత హెచ్‌సీఎల్, టీసీఎస్ సైతం ఈ సమస్య బారిన పడ్డాయి. తాజాగా టీసీఎస్ నార్త్ అమెరికా వ్యాపారానికి నేతృత్వం వహిస్తున్న సురేష్ ముత్తుస్వామి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో కంపెనీకి చెందిన 15 బిలియన్ డాలర్ల వ్యాపార బాధ్యతలు నిర్వహించేందుకు సరైన వ్యక్తిని ఎంపిక చేసే పనిలో టీసీఎస్ ఉంది.

గత ఏడాది జూన్‌లో టీసీఎస్ సీఈవోగా కె కృతివాసన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది అతి ముఖ్యమైన కార్యనిర్వాహక నిష్క్రమణ. గతంలో సీఓఓగా ఉన్న ఎన్.గణపతి సుబ్రమణియన్ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు మార్చి 2022లో TCS బిజినెస్ రెవెన్యూ షేర్ హెడ్‌గా నియమితులైన ముత్తుసామి ఆగస్టు ప్రారంభంలో కంపెనీని విడిచిపెట్టినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ దశలో ఉత్తర అమెరికా రీజియన్ ప్రెసిడెంట్ అమిత్ బజాజ్ బాధ్యతలను తీసుకుంటారని టీసీఎస్ తెలిపింది. వాస్తవానికి ఆగస్టు 2020 నుంచి అధ్యక్షుడిగా తన పదవిని నిర్వహిస్తున్న అమిత్ బజాజ్ ఇప్పుడు ఈ ప్రాంత కార్యకలాపాలను నిర్వహించనున్నారు.
ప్రస్తుతం రాజీనామా చేసిన ముత్తుస్వామి టీసీఎస్ కంపెనీలో దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే తాను ఎందుకు కంపెనీని వీడుతున్నారనే విషయాన్ని ఇంకా వెల్లడికాలేదు. ముత్తుస్వామి నాయకత్వంలో అమెరికా, కెనడాతో కూడిన టీసీఎస్ ఉత్తర అమెరికా వ్యాపారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం 29.1 బిలియన్ డాలర్లతో 51.1% రాబడి వాటాను కలిగి ఉంది. వ్యాపారపరంగా కంపెనీకి ఇది ముఖ్యమైన మార్కెట్ అని చెప్పుకోవచ్చు. టెక్ కంపెనీల్లో ప్రధానంగా కొనసాగుతున్న ఉన్నత స్థాయి ఉద్యోగ నిష్ర్కమణలు ఉద్యోగులను సైతం కొంత కాలవరానికి గురిచేస్తున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications