IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
Infosys News: దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ ఈ ఏడాది చాలా తక్కువ సంఖ్యలోనే కొత్త ఉద్యోగుల నియామకం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో రిక్రూట్మెంట్ స్టైల్ మార్చటంతో కాలేజీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి టెక్ దిగ్గజం క్యాంపస్ హైరింగ్‌లకు ఈ ఏడాది దూరంగా ఉంది. గతంలో ఇన్ఫోసిస్ చాలా మంది ఫ్రెషర్లను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసేది. కానీ.. ఈసారి మాత్రం కొత్తగా నియమించబడిన ఉద్యోగుల్లో 50% మంది క్యాంపస్ వెలుపల నుంచి ఎంపిక చేయబడి, ఉద్యోగాల్లో నియమించబడ్డారు. 2024 చివరి మూడు త్రైమాసికాల్లో ఇన్ఫోసిస్ కాలేజీల నుంచి ఫ్రెషర్‌లను రిక్రూట్ చేసుకోలేదు. చివరిగా 2023లో ఇన్ఫోసిస్ 51,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది.

తాజా త్రైమాసిక ఫలితాల వెల్లడి సమయంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ అందించిన వివరాల ప్రకారం.. కొత్తగా ఎంపికైన వారిలో 50% మంది కాలేజీల నుంచి, మిగిలిన 50% మందిని ఇతర మార్గాల ద్వారా ఎంపిక అవుతున్నారని తెలిపారు. అయితే 2025లో కాలేజీల నుంచి ఎంత శాతం మందిని ఎంపిక చేస్తారనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని జయేశ్ పేర్కొన్నారు.
మరో పక్క టాటా గ్రూప్ కంపెనీ టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1500 నుంచి 2000 మంది ఇంజనీరింగ్ ఫ్రెషర్లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఇదే సమయంలో లేటరల్ హైరింగ్ అవసరాలకు అనుగుణంగా ఉంటుందని మార్చి త్రైమాసిక ఫలితాల వెల్లడి సమయంలో కంపెనీ తెలిపింది. కంపెనీ పొందే డీల్స్, ఆదాయాలకు అనుగుణంగా జాగ్రత్తగా కొత్త నియామకాలు కొనసాగుతాయని టాటా గ్రూప్ కంపెనీ వెల్లడించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2,135 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ ఆటోమోటివ్, బ్రాడ్‌కాస్ట్, కమ్యూనికేషన్స్, హెల్త్‌కేర్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌తో సహా పరిశ్రమల అంతటా డిజైన్ & టెక్నాలజీ సేవలను అందిస్తున్న ప్రపంచ స్థాయిలో ముఖ్యమైన సంస్థగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications