స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 32 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 46 పాయింట్లు పెరిగి 74386 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 పాయింట్లు వృద్ధి చెంది 22587 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టెక్ మహీంద్రా, టాటా స్టీల్, విప్రో, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, మారుతి, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, టైటాన్, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, అల్ట్రా టెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐఎన్, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ మార్చి FY24తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 15% వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.1% పెరిగి రూ.5,376.44 కోట్లకు చేరుకుంది.

బజాజ్ ఫైనాన్స్ మార్చి FY24 త్రైమాసికానికి రూ. 3,825 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 21% వృద్ధి చెందింది. టెక్ మహీంద్రా మార్చి FY24తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభాన్ని రూ. 661 కోట్లుగా నమోదు చేసింది. బలహీనమైన టాప్‌లైన్‌తో పోలిస్తే మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 29.5% భారీగా పెరిగింది. దీంతో టెక్ మహీంద్రా స్టాక్ శుక్రవారం 10 శాతం పెరిగింది.
శుక్రవారం హెచ్ సీఎల్ టెక్, మారుతి సుజీకి, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, అతుల్, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ హెల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్, సీఎస్బీ బ్యాంక్, మాస్టేక్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్, విఎస్టీ ఇండస్ట్రీస్ ఫలితాలను ప్రకటించనున్నాయి.


Click it and Unblock the Notifications