మంచి కాలేజీలో చదివి ఉద్యోగం కోసం చేస్తున్నవారికి ఇప్పుడు ఓ కొత్త ఆందోళన మొదలైంది. బీటెక్ అయిపోయాక లేదా పై చదువులు పూర్తి చేసాక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ కొట్టేస్తే చాలు అనుకునేవాళ్ళకి ఇప్పుడు అంత ఈజీ కాదు. ఈ ఏడాది మొదటి నుండే ప్రముఖ దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ ఉద్యోగులని ఇంటికి పంపిస్తున్నాయి. అయితే తొలగింపులకి కారణాలు అదనపు ఖర్చులు తగ్గించుకునేందుకు అంటూ చెబుతున్నాయి.

ఈ తరుణంలోనే ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతున్నాయని ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు ఉదిత్ గోయెంకా హెచ్చరించారు. కేవలం డిగ్రీ పొందడం మాత్రమే సరిపోదు, రియల్ టైం ప్రాజెక్టులు చేయడం ద్వారా మీ స్కిల్స్ నిరూపించుకోవాలి అని అన్నారు. ముంబైకి చెందిన స్టార్టప్ టైనీచెక్ వ్యవస్థాపకుడు అండ్ CEO ఉదిత్ గోయెంకా ఐటీ రంగంలో ఉద్యోగాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో కొత్త ఐటీ డెవలపర్లకు ఉద్యోగం దొరకడం కష్టమవుతుందని అన్నారు. సోషల్ మీడియా Xలో కొత్త గ్రాడ్యుయేట్లు డిగ్రీలపై మాత్రమే ఆధారపడవద్దని ఆయన సూచించారు. మీరు కాలేజీ పూర్తి చేసి ఉంటే మీ సొంత ప్రాజెక్టులను సృష్టించి ఓపెన్ సోర్స్‌లో ఉంచండి. ఇది మీ స్కిల్స్ ప్రదర్శించడానికి ఇంకా జాబ్ పొందే అవకాశాలను పెంచడానికి సహాయపడుతుంది" అని అన్నారు. గోయెంకా చేసిన ఈ ప్రకటన తర్వాత ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ ప్రారంభమైంది. ఐటీ రంగం వేగంగా మారుతోందని, కేవలం డిగ్రీ ఉన్నంత మాత్రాన ఉద్యోగం దొరకదని చాలామంది అంగీకరించారు.
ఆటోమేషన్ ఇతర రంగాలపై కూడా ప్రభావం: ఆటోమేషన్ ఇంకా ఇతర రంగాలపై దీని ప్రభావం గురించి కూడా చర్చలు జరిగాయి. ఒక అతను అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లని ఉదాహరణగా చెప్తూ చాలా మంది భారతీయ, పాకిస్తానీ ఇంకా ఆఫ్రికన్ వలసదారులు ఇక్కడ ఉబెర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు వేమో వంటి కంపెనీలు డ్రైవర్‌లెస్ కార్లను ప్రోత్సహిస్తున్నాయి, దింతో ఇవి ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తుంది. అదేవిధంగా ఐటీ రంగంలో డిగ్రీలు ఉన్నవారే కాదు, రియల్ టైం ప్రాజెక్టులపై పనిచేసే వారు కూడా ముందుకు సాగగలరు.
వైట్ కాలర్ ఉద్యోగాలకు AI ముప్పు: భారతదేశంలో వైట్ కాలర్ ఉద్యోగాల గురించి ఆందోళనలు పెరుగుతున్న టైంలోనే ఈ హెచ్చరిక వచ్చింది. కృత్రిమ మేధస్సు (AI) 40-50% వైట్-కాలర్ ఉద్యోగాలను తొలగించగలదని ఆటమ్‌బెర్గ్ వ్యవస్థాపకుడు అరిందమ్ పాల్ తాజాగా అన్నారు, ఈ చర్య భారతదేశ మధ్యతరగతి, వినియోగదారుల ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొత్త గ్రాడ్యుయేట్లు ఇప్పుడు చదువులపైనే కాకుండా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది, దీని ద్వారా వీరు ఫ్యూచర్ రెడీగా ఉండగలరు.
వైట్ కాలర్ ఉద్యోగాలు అంటే ఏమిటి: వైట్ కాలర్ ఉద్యోగాలు అంటే ఆఫీసులో కూర్చుని మానసికంగా పని చేసే ఉద్యోగాలు. శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది ఇంకా కంప్యూటర్లు, పేపర్లు, ఇమెయిల్‌లు లేదా ఫోన్‌ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఉద్యోగాలు సాధారణంగా బ్యాంకులు, ఐటీ కంపెనీలు, స్కూల్స్, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు లేదా పెద్ద కంపెనీలలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఉపాధ్యాయులు, మేనేజర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు, వైద్యులు లేదా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు వైట్ కాలర్ ఉద్యోగాల కిందకు వస్తారు. ఈ రకమైన ఉద్యోగాలలో ఉద్యోగులు డ్రెస్ కోడ్ ధరించి వర్క్ చేస్తారు, కాబట్టి దీనిని "వైట్ కాలర్" అని పిలుస్తారు. ఈ ఉద్యోగాలు సాధారణంగా మంచి జీతాలు ఇస్తాయి ఇంకా వర్క్ కల్చర్ ఉంటుంది. కానీ ఉద్యోగులు ఆన్ టైంలో వర్క్ పూర్తి చేసి కొన్ని బాధ్యతలను మోయవలసి ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications