కృత్రిమ మేధస్సు (AI) టెక్ రంగాన్ని వేగంగా మార్చేస్తోంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు AI ఆధారిత టెక్నాలజీలు ఉత్పాదకతను పెంచుతున్నప్పటికీ.. మరోవైపు లక్షలాది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి. అయినా ఇంకా 2025లో టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
స్వతంత్ర లేఆఫ్స్ ట్రాకర్ Layoffs.fyi గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 551 టెక్ కంపెనీల నుంచి సుమారు 1,22,549 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. గత కొన్ని వారాలుగా తొలగింపుల వేగం కొంత తగ్గినప్పటికీ.. వాటి ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా AIపై భారీగా పెట్టుబడులు పెడుతున్న పెద్ద టెక్ కంపెనీల్లో ఈ ఉద్యోగ కోతలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ తొలగింపులకు ప్రధాన కారణాల్లో ఒకటి కంపెనీలకు పెరుగుతున్న ఖర్చులు. ద్రవ్యోల్బణం, సుంకాలు, ఆపరేటింగ్ ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయాలనే లక్ష్యంతో AI ఆధారిత ఆటోమేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నాయి. తాత్కాలికంగా ఇది కంపెనీలకు లాభదాయకంగా కనిపించినప్పటికీ, ఉద్యోగుల భవిష్యత్తుపై ఇది పెద్ద ప్రశ్నార్థకాన్ని సృష్టిస్తోంది.
ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీల జాబితాలో అమెజాన్ ముందు వరసలో ఉంది ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అక్టోబర్‌లో తన చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్‌ను ప్రకటించింది. దాదాపు 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గిస్తూ.. AIతో సహా ఇతర రంగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.
ఇక మైక్రోసాఫ్ట్ కూడా 2025 నాటికి మొత్తం 15 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది.జూలైలో జరిగిన పునర్నిర్మాణంలోనే సుమారు 9 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. AI ఆధారిత ఉత్పత్తులు, సేవలపై దృష్టి పెంచడమే ఇందుకు ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది.
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా ఈ layoffs జాబితాలో చేరడం దేశ ఐటీ రంగాన్ని ఆందోళనకు గురి చేసింది. సంస్థ తన వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం తగ్గింపు.. అంటే దాదాపు 12 వేల ఉద్యోగాల కోత ప్రకటించింది. అయితే.. ఇది నేరుగా AI కారణంగా జరిగిందన్న వాదనలను TCS ఖండించింది. నైపుణ్యాల అసమతుల్యత, మారుతున్న వ్యాపార నమూనాలే ప్రధాన కారణాలుగా వివరించింది.
ఇదే సమయంలో ఇంటెల్ తన ఉద్యోగులలో 15 శాతం వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. 2024 చివరికి 1,09,800 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ, ఈ సంవత్సరాంతానికి కోర్ ఉద్యోగులను సుమారు 75 వేల మందికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సేల్స్‌ఫోర్స్ CEO మార్క్ బెనియోఫ్ ప్రకారం.. AI సహాయంతో కంపెనీ 4 వేల కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను తగ్గించింది. ప్రస్తుతం సంస్థలో సుమారు 50 శాతం పని AI ద్వారానే జరుగుతోందని ఆయన వెల్లడించారు. అయితే.. ఇదే సమయంలో కొత్త నియామకాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం.
HP,ఆపిల్,మెటా,గూగుల్,వెరిజోన్,సీమెన్స్ వంటి సంస్థలు కూడా వందల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ లేఆఫ్స్ అన్నింటిలోనూ AI ఆధారిత పునర్వ్యవస్థీకరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా AI టెక్నాలజీ టెక్ రంగాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత విషయంలో పెద్ద సవాళ్లను తీసుకొస్తోంది.భవిష్యత్తులో ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, AIతో కలిసి పనిచేసే విధంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications