సంచలనంగా TCS పే ప్యాకేజ్.. మరీ ఇంత దారుణమా అంటూ నెట్టింట చర్చ..!!

TCS News: దేశంలో అనేక లక్షల మందికి ఉద్యోగాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అందిస్తున్న ప్రధాన కంపెనీల్లో టాటాలకు చెందిన టీసీఎస్ ఒకటి. ఈ క్రమంలో కంపెనీ అందిస్తున్న జీతం వైరల్‌గా మారింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొత్తగా చార్టర్డ్ అకౌంటెంట్ల రిక్రూట్‌మెంట్ నిర్వహించింది. అయితే ఇది ప్రస్తుతం దేశంలోని వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది. టెక్ దిగ్గజం ఆశ్చర్యకరమైన వేతన ప్యాకేజీకి సీఏ పాసైన వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటోంది. కొత్తగా అర్హత పొందిన చార్టర్డ్ అకౌంటెంట్లకు తన ఆఫర్ లెటర్‌లో 'అసిస్టెంట్ సిస్టమ్ అనలిస్ట్ - ట్రైనీ' అనే పేరుతో నియమించుకుంటూ ఏడాదికి రూ.7.5 లక్షల వేతన ప్యాకేజీని అందించింది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ సెప్టెంబర్ 10, 2024న జరగనుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో టీసీఎస్ చార్టెడ్ అకౌంటెట్స్ సంస్థ ఐసీఏఐ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా నిర్వహిస్తోంది.

Tech jaint TCS offering 3 86 lakh fixed package to CA freshers sparks discussion

దేశ ఆర్థిక రాజధాని ముంబై మెట్రో నగరంలో పనిచేసేందుకు చార్టర్డ్ అకౌంటెంట్లకు ఆఫర్ చేసిన జీతం ప్యాకేజీ గురించి వేడివేడి చర్చ కొనసాగుతోంది. లింక్డ్‌ఇన్‌లో అనేక మంది సీఏలు టీసీఎస్ ఆఫర్ చేస్తున్న వేతనంపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలను ఛేదించడంలో శక్తివంచన లేకుండా కృషి చేసిన విద్యార్థులకు ఇంత తక్కువ ప్యాకేజీ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అంటూ స్వరం వినిపిస్తున్నారు. ఒకసారి పే ప్యాకేజీని నిశితంగా పరిశీలిస్తే ఇందులో రూ.3.86 లక్షలకు స్థిర వేతనం ఉండగా మిగిగిన రూ.3.63 లక్షలు వేరియబుల్ పే కావటం గమనార్హం.

ప్రస్తుతం మార్కెట్లో సీఏలకు అందుతున్న తక్కువ వేతనాలు చాలా మందిని నిరాశకు గురిచేస్తున్నాయని సీఏ ఫ్యాకల్టీ CA అలెన్ అలెక్స్ అన్నారు. వాస్తవానికి కోర్సులో ఉండే కఠినత, దానిని పూర్తి చేస్తే అందుకునే ఆర్థిక రివార్డుల వాగ్దానం మధ్య పొంతన లేకుండటంపై ఆయన స్పందించారు. ఇది వృత్తి ప్రాముఖ్యత గురించి ప్రజలకు ప్రతికూల సందేశాన్ని పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఇదే క్రమంలో కేరళకు చెందిన ఒక సీఏ ఫ్రెషర్ మాట్లాడుతూ.. టీసీఎస్ ఆఫర్ చేసిన వేతనం చాలా నిరుత్సాహకరమని అన్నాడు. తాము ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసేందుకు చిందించిన చెమట, నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు గంటల తరబడి గడిపిన సమయానికి ఆఫర్ చేస్తున్న జీతం వర్త్ కాదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత వేతనాలను చూసిన జౌత్సాహిక విద్యార్థులు సైతం తక్కువ వేతనాల కోసం ఇంత కష్టపడటం అవసరమా అనే అయోమయంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+