TCS News: ప్రస్తుతం టెక్ రంగంలో పరిస్థితులు అస్సలు ఏమాత్రం బాలేదు. దీంతో దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ సైతం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కంపెనీలో అసలు ఏం జరుగుతోందంటే..
ప్రాజెక్టుల ప్రారంభం ఆలస్యం కావటంతో టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్నీ సర్వీసెస్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 1.8 నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన లాటరల్ హైరీల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను మూడు నెలల పాటు ఆలస్యం చేస్తున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా వెల్లడైనట్లు మనీకంట్రోల్ నివేదించింది. సమాచారం ప్రకారం బెంగళూరు, పూణే, కొచ్చి, భువనేశ్వర్, ఢిల్లీ NCR, ఇండోర్‌తో సహా నగరాల్లో 200 మందికి పైగా లాటరల్ రిక్రూట్‌లు ఆలస్యం కారణంగా ప్రభావితమయ్యాయి.

గ్లోబల్ ప్రతికూలత మధ్య భారతీయ ఐటి రంగం ఇప్పటికే స్థూల ఆర్థికపరమైన ఎదురుగాలితో దెబ్బతింది. టెక్ కంపెనీలు.. క్లయింట్లు తమ టెక్ బడ్జెట్‌లను తగ్గించుకోవడంతో ప్రాజెక్ట్ వాయిదాలు, రాంప్-డౌన్‌లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆన్ బోర్డింగ్ కోసం వేచి ఉన్న వారు జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో రిక్రూట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలా మంది కొత్త నియామక తేదీ ఖరారు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జూలై 10న వీరిలో చాలా మందికి తమ చేరిక తేదీలు అక్టోబర్‌కు పుష్ అవుతున్నాయని పేర్కొంటూ ఈ-మెయిల్స్ వచ్చాయి.
చాలా సంస్థలతో కలిసి పనిచేసిన తాము ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని సీనియర్ టెక్కీలు చెబుతున్నారు. ఆన్ బోర్డింగ్ కోసం వేచిచూస్తున్న చాలా మంది మరొక కంపెనీలో ఆఫర్లను వెతుక్కునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. కుటుంబ పాలన, పిల్లల బాధ్యతలు, బ్యాంక్ రుణాలతో ఉన్న తాము సతమతమౌతున్నామని ఒకరు వెల్లడించారు.
నెల రోజుల కిందటే వెలుగులోకి వచ్చిన మరో భారీ హైరింగ్ స్కామ్‌తో టీసీఎస్ ఇప్పటికే మల్లగుల్లాలు పడుతుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. అనేక స్టాఫింగ్ సంస్థలు కంపెనీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (RMG)లోని సీనియర్ TCS ఎగ్జిక్యూటివ్‌లకు లంచం ఇస్తున్నట్లు గుర్తించబడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications