Apple News: ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోజులు గడిచేకొద్దీ అన్నీ సర్థుకుంటాయి అనుకునే తరుణంలో ఇప్పుడు అమెరికాలో రెండు బ్యాంకులు కుప్పకూలటం.. ఇప్పుడు వ్యాపార సంస్థలు మరింత అప్రమత్తం అవుతున్నాయి.

ఆందోళనలో ఆపిల్..
మాంద్యం భయాలు సుదీర్ఘంగా కొనసాగటంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో కంపెనీలు ఈ చర్యలు చేపడుతున్నాయ. అయితే ఇదే క్రమంలో ఆర్థిక వ్యవస్థల్లో డిమాండ్ తగ్గటంతో ఆపిల్ సంస్థ సైతం అప్రమత్తమైంది. తన నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. ఖర్చులను తగ్గించే ప్రయత్నాలను వీలైనంత విస్తరిస్తోందని బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది.

ఉద్యోగులపై ప్రభావం..
ఖర్చుల మదింపు కోసం ఆపిల్ సంస్థ చేస్తున్న చర్యలు ఉద్యోగులను నిరుత్సాహ పరుస్తున్నాయి. చర్యల్లో భాగంగా సంస్థ తన కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో కొంత భాగానికి బోనస్‌ల ఫ్రీక్వెన్సీని తగ్గించనుంది. అలాగే కొత్త ఉద్యోగుల నియామకాలను తాత్కాలికంగా నెమ్మదింప చేసింది. ఖాళీ అయిన స్థానాలను నింపటాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచింది. కొవిడ్ తర్వాతి పరిణామాల వల్ల డిమాండ్ దెబ్బతినడంతో ఖర్చులను తగ్గించుకోవడానికి చర్యలు చేపట్టిన సంస్థల జాబితాలో ఆపిల్ తాజాగా చేరింది.

గతంలో బోనస్..
కుపెర్టినో ప్రధాన కార్యాలయం కలిగిన టెక్ దిగ్గజం డివిజన్ ఆధారంగా సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు బోనస్‌లు, ప్రమోషన్‌లను అందజేసేది. కొన్ని డివిజన్లలోని ఉద్యోగులకు ఏప్రిల్, అక్టోబర్‌లో ఏడాదికి రెండుసార్లు బోనస్‌లు గతంలో అందాయి. కానీ కొత్త ప్లాన్ ప్రకారం.. గ్రూప్ వచ్చే నెలలో బోనస్‌లు లేదా ప్రమోషన్‌లను ఇచ్చే ఉద్దేశంలో లేదని తెలుస్తోంది. ఇవి వార్షిక షెడ్యూల్ కి మారి అక్టోబరులో జరుగుతాయని సమాచారం.

మెటా ప్రకటన..
అమెరికాకు చెందిన ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు సంబంధించి మంగళవారం అతిపెద్ద వార్త మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట ఆర్థిక పరిస్థితుల కారణంగా మరిన్ని ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఆసారి దఫాలో దాదాపు 10,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని వెల్లడైంది. అయితే నియామకాలు జరపని 5000 ఓపెన్ పొజిషన్లను సైతం క్లోజ్ చేయాలని నిర్ణయించినట్లు CEO మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. దీనికి ముందు కొన్ని నెలల కిందట కంపెనీ ఏకంగా 11,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications