టెక్ పరిశ్రమలో భారీ జీతాలు, మెరిసే కెరీర్లు, గ్లోబల్ అవకాశాలు కనిపించినా, లోపల ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, మానసిక సమస్యలు, భావోద్వేగ పతనం బయటకు చాల తక్కువగా వస్తాయి. ఇటీవలి రోజులలో ఈ వాస్తవికతను వెలుగులోకి తెచ్చేలా ఒక టెక్నీషియన్ చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. X (గతంలో ట్విట్టర్)లో రితేష్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ టెక్ ఉద్యోగుల్లో పెరుగుతున్న బర్న్ అవుట్, ఒత్తిడి, అస్థిరతను ప్రతిబింబిస్తూ అనేక మందిని కదిలించింది.
తన కాలేజీ సీనియర్‌తో జరిగిన ఫోన్ కాల్ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ రితేష్.. తన స్నేహితుడు పూర్తిగా మానసికంగా విఫలం కావడంతో..జాబ్ వదులుకోవడం అనే తీవ్రమైన ఆలోచన చేసేవరకు తను చేరుకున్నాడని పేర్కొన్నారు. టెక్ చాలా క్రూరంగా ఉంది. డ్యూడ్ సాధారణంగా సుయిసైడ్ గురించి మాట్లాడి ఈ రాట్రేస్‌ని ముగించాలని అనుకున్నాడని తనకు చెప్పినట్లుగా రితేష్ తన పోస్ట్‌లో రాశాడు. ఈ ఒక వాక్యం ఉద్యోగులు ఎదుర్కొంటున్న అంతర్గత పరిస్థితులకు ఎంత పెద్ద సంకేతమో చూపిస్తోంది.వారి బాధ ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ఇటీవలి కాలంలో టెక్ రంగంలో వరుసగా జరుగుతున్న భారీ తొలగింపులు ఉద్యోగుల్లో మరింత భయం, అనిశ్చితిని రేకెత్తించాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు కోల్పోతారో తెలియని వాతావరణంలో, రోజువారీ పని ఒత్తిడి, సుదీర్ఘ పని గంటలు, అచీవబుల్ కాని డెడ్‌లైన్లకు పెరిగిన బాధ్యతలు పరిస్థితిని ఇంకా విషమం చేస్తున్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. రితేష్ పోస్ట్ కూడా ఇదే విషయం సూచించింది .. ఉద్యోగాలు కోల్పోతామనే భయంతో చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు తనను తాను లేదా ప్రపంచాన్ని నిందించకుండా, మార్పు కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఇది చెడ్డ మార్కెట్ అని నాకు తెలుసు. కానీ మీరు చేస్తే చేయగలుగుతారు. రోజు వారీ కూలీ రూ.500 సంపాదిస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు? అంటూ ప్రశ్నించారు. ప్రొఫెషనల్ అహంకారాన్ని పక్కన పెట్టి, ఏ పనైనా ప్రారంభించి ముందుకు సాగాలనే ప్రేరణా సందేశం ఇచ్చారు. Tech రంగంలో ఉన్నవారు తమను తాము 'కేవలం ఉద్యోగాలతో'నే నిర్వచించుకోరాదని ఆయన స్పష్టం చేశారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో X వినియోగదారుల్లో అనేకమంది దీనికి భావోద్వేగంగా స్పందించారు. కొందరు రితేష్ స్నేహితుడికి మద్దతు ప్రకటించగా..మరికొందరు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాను.ఇది బాధపడే సమయం కాదు, నిలబడి పోరాడే సమయమని ఒకరు రాశారు.
మరొక వ్యక్తి తన పరిస్థితిని పంచుకుంటూ ఇక్కడ కూడా ఇదే. నా తండ్రి ఈ సంవత్సరం మరణించారు, పొదుపు లేదు, ఫైనల్ రౌండ్స్ దాకా వెళ్ళిన తర్వాత కూడా నేను తిరస్కరించబడ్డానని చెప్పారు. ఈ కామెంట్లు టెక్ పరిశ్రమలో పని చేసే లక్షలాది మంది ఎదుర్కొంటున్న నిజమైన దాచిపెట్టిన బాధను స్పష్టం చేస్తున్నాయి.
నవంబర్ 30, 2025న షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పటివరకు 78,000 వీక్షణలు, 600 కంటే ఎక్కువ లైక్స్ సంపాదించింది. ఈ సంఘటన మానసిక ఆరోగ్యంపై, సురక్షిత, మానవతా పనిచర్యల అవసరంపై పరిశ్రమను మరోసారి ఆలోచింపజేసేలా చేసింది. మెరిసే ఆఫీసుల వెనుక, కోడ్‌ల వెనుక, ఒక మనిషి బాధ, ఒత్తిడి, పోరాటం ఉందని ఈ కథనం గుర్తు చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications