రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి కాలం కలిసి రానుంది. కోవిడ్-19 తరువాత వేలల్లో ఉద్యోగాల కోత విధించిన టెక్ కంపెనీలు ప్రస్తుతం రిక్రూట్మెంట్ల మీద పడ్డాయి. ఈ తరుణం మరో పెద్ద కంపెనీ బిటెక్ ఫైనల్ ఇయర్ వాళ్లకు గుడ్ న్యూస్ అందించింది. భారతదేశపు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 నాటికి కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ప్రెస్సర్‌లను తీసుకోనున్నట్లు TCS HR అధికారి మిలింద్ లక్కడ్ తెలిపారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా ఆయన చెప్పారు. అంతే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జెనరేటివ్ AI వంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పని చేయడానికి ట్రైనింగ్ ఇవ్వాలని కూడా యోచిస్తోంది. టీసీఎస్ ప్రస్తుతం మంచి రాబడులు అందుకుంటున్న కంపెనీ. ఇప్పుడు కంపెనీ సీనియర్ ఉద్యోగులను రిక్రూట్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. కీలకమైన వ్యాపార రంగాల్లో గ్రోత్ ట్రెండ్ కారణంగా TCS ఈ చర్య తీసుకుంటోంది.
అలాగే TCS వంటి భారతదేశంలోని ఇతర IT కంపెనీలు కూడా వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఇంకా 1 సంవత్సరానికి పైగా నిలిచిపోయిన ఆన్-క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను నియమించుకునే ప్రక్రియను తిరిగి ప్రారంభించాయి. దీని కోసం టీసీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను కెరీర్ రెడీ చేసుకునేందుకు ట్రైనింగ్ కూడా అందించాలని ప్లాన్ చేసింది. TCS టెక్నాలజీ వెండర్స్ తో కలిసి పనిచేస్తుంది. విద్యార్థుల ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నప్పుడు ప్రత్యేక ట్రైనింగ్ అందించడానికి టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో ఒక కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.

ప్రస్తుతం, TCS కంపెనీ 5 డే వర్క్ పాలసీ పై పని చేస్తోంది. అటెండేన్స్ పాలసీ ఆధారంగా ఆఫీసుకి వచ్చే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు లెక్కిస్తారని చెబుతున్నారు. ఆఫీస్ క్లాచర్ బలోపేతం చేసేందుకు, ప్రతి ఒక్కరూ సహకారంతో పని చేసేలా ప్రోత్సహించడానికి TCS ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
19 సంవత్సరాలలో మొదటిసారిగా TCS 2024 ఆర్థిక సంవత్సరంలో 19,249 మంది ఉద్యోగులను తగ్గించింది. ఉద్యోగుల టర్నోవర్ రేటు గత త్రైమాసికంలో 12.1 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగింది. అయితే ఈ త్రైమాసికంలో అట్రిషన్ రేటు గత ఏడాది ఇదే త్రైమాసికంలో 14.9 శాతం కంటే తక్కువగా ఉంది. ఆర్థికంగా చూస్తే రెండో త్రైమాసికంలో TCS నెట్ ప్రాఫిస్ట్ రూ.11,999 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో రెవెన్యూ 7.6 శాతం పెరిగి రూ. 64,559 కోట్లుగా ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications