కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియన్ సాఫ్టువేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కీలక ప్రకటన చేసింది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా తాము పెద్ద ఎత్తున ఫ్రెషర్స్‌ను ఉద్యోగంలోకి తీసుకుంటామని తెలిపింది. గత ఏడాది 40,000 మంది ఉద్యోగులను తీసుకుంది. ఈ ఆర్థికసంవత్సరం తొలి క్వార్టర్‌లో టీసీఎస్ ఆదాయం తగ్గిన విషయం తెలిసిందే. కానీ క్రితంసారి వలె ఈసారి కూడా కొత్తవారిని తీసుకుంటామని ప్రకటించింది.

40వేల కొత్త ఉద్యోగాలు
గత ఏడాదిలాగే ఈసారి కూడా నలభై వేలమంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అలాగే, అమెరికా క్యాంపస్‌లో 2,000 మంది ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోనున్నట్లు తెలిపింది. ఇప్పటికే హెచ్1బీ, ఎల్1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించింది. ఇప్పుడు స్థానికంగానే మరికొంత మందిని తీసుకునేందుకు సిద్ధమైంది. భారత్‌లో 40,000 దాదాపు 35వేల నుండి 45వేల మధ్య ఉద్యోగులను తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను ఉద్యోగులను తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారం తిరిగి పుంజుకుంటుందని టీసీఎస్‌కు ఎంతో ధీమా ఉందని అంటున్నారు. మూడో క్వార్టర్ నుండి పుంజుకుంటామని క్వార్టర్ 1 ఫలితాల సమయంలోనే టీసీఎస్ ప్రకటించింది. ఆ ధీమాకు ఇది కొనసాగింపు.

అమెరికాలో స్థానికులు..
2014 నుండి అమెరికా క్యాంపస్‌లో టీసీఎస్ 20,000 మంది స్థానికులను తీసుకున్నట్లు టీసీఎస్ ఈవీపీ అండ్ గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంజినీర్స్‌తో పాటు టాప్ 10బీ స్కూల్స్ నుండి గ్రాడ్యుయేట్స్‌ను తీసుకుంటామని తెలిపింది. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ కలిగిన వారిని తీసుకుంటామన్నారు. అమెరికాలో స్థానికులను తీసుకోవడం కొత్త కాదని, క్రమంగా పెంచుతున్నట్లు చెప్పారు.

వారిని తీసుకుంటున్నాం
గత ఏడాది నియమించుకున్న ఫ్రెషర్లను ఈ నెల ప్రారంభం నుండి ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో 87 శాతం మంది ఇప్పటికే శిక్షణలో యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. ప్రతి వారం 8వేల నుండి 11వేల మందిని ఆన్ లైన్ తద్వారా రిక్రూట్ చేసుకుంటున్నామని, మరో ఎనిమిది వేల మందికి పైగా రిక్రూట్మెంట్ పూర్తయిందని చెప్పారు.
వీరితోపాటు 100 మంది ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారిని కూడా నియమించుకోనుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications