కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు ఉత్పత్తి, డిమాండ్ లేక పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నాయి. దీంతో కోట్లాది ఉద్యోగాలు పోయే ప్రమాదం కనిపిస్తోంది. మన దేశంలోని కరోనా, లాక్ డౌన్ కారణంగా ఎన్నో కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు తగ్గించడం లేదా ఉద్యోగుల తొలగింపు చేపడుతున్నాయి. కరోనా ప్రభావం ఐటీ సెక్టార్ పైన కూడా భారీగానే పడింది. దీంతో ఈ రంగంలో ఉద్యోగాలపై ఏ మేరకు ప్రభావం ఉంటుందనే ఆందోళన నెలకొంది. అయితే దిగ్గజ TCS సంస్థ ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చే ప్రకటన చేసింది.

ఉద్యోగులను తొలగించం, కానీ శాలరీ పెంపు లేదు
ప్రస్తుత పరిస్థితుల్లో TCS చేసిన ప్రకటన ఊరటనే అని చెప్పవచ్చు. తమ కంపెనీలో నుండి ఉద్యోగులను తొలగించేది లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో వేతనాల పెంపు లేదా ఇంక్రిమెంట్స్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా టీసీఎస్ క్వార్టర్ 4లో లాభాల్లో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. అంతేకాదు, ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే రెండు క్వార్టర్‌లలో ప్రతికూల ప్రభావం కొనసాగుతుందని తెలిపింది.

4.5 లక్షలమంది ఉద్యోగులకు హామీ
ప్రస్తుతం TCSలో 4.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎవరినీ తొలగించబోవటం లేదని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ చెప్పారు. కానీ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచరాదని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఉంటాయ్
ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో పాటు ఇప్పటికే ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి కూడా హామీ ఇచ్చింది టీసీఎస్. ఈ ఏడాది క్యాంపస్ ఆఫర్స్ అన్నింటికీ తమ కంపెనీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈవీపీ అండ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మిలింద్ లక్కడ్ మేరకు టీసీఎస్ ఈ ఏడాది 40,000 మందిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా తీసుకుంది. వీటికి కట్టుబడి ఉన్నట్లు చెప్పింది.

కంపెనీ ఏ పరిస్థితుల్లో ఉన్నా.. మీ ఉద్యోగాలు మీవి
చాలా విద్యా సంస్థలు మిడ్ జూన్ నుండి జూలై మధ్యలో విద్యా సంవత్సరాన్ని ముగిస్తాయని, తాము కూడా ఆన్-బోర్డింగ్‌ను అప్పటి నుండి ప్రారంభిస్తామని, ఇది ఈ ఏడాది చివరి వరకు ఉంటుందని టీసీఎస్ తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికే ఇచ్చిన ఆఫర్లకు (ఉద్యోగాలు) కట్టుబడి ఉన్నామని ఫ్రెషర్స్‌లో ధీమా నింపింది.

బిజినెస్‌పై ఆధారపడి ప్రమోషన్లు
ప్రమోషన్లు కొనసాగుతాయని, అయితే ఇది మున్ముందు వ్యాపార పని తీరుపై ఆధారపడి ఉందని చెబుతున్నారు. వ్యాపార పనితీరు ప్రతి మూడు నెలలకు ఓసారి మూల్యాంకనం చేయబడుతోందన్నారు.

పెద్ద ఎత్తున ఉద్యోగాలు
2019-20 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ పెద్ద ఎత్తున ఉద్యోగ ఆఫర్లు ఇచ్చింది. గత అయిదేళ్లలోనే ఈ క్వార్టర్ 1లో 30,000 ప్లేస్‌మెంట్స్ ఇచ్చింది. మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి మరో 1,789 మందిని జోడించింది. FY20 ముగిసే నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 4,48,464. అట్రిషన్ రేటు 12.1 శాతంగా ఉంది.

90 శాతం మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
'శాలరీ హైక్స్‌ను హోల్డ్‌లో పెట్టాం, ఈసారి వేతనాల పెంపు ఇవ్వొద్దని నిర్ణయించాం' అని మిలింద్ లక్కడ్ చెప్పారు. టీసీఎస్‌కు ఇండియాలో 3.55 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 90 శాతం మంది తమ క్లయింట్స్ అవసరాలు తీర్చేందుకు పని చేస్తున్నారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణియమ్ చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పెరిగిన ప్రోడక్టివిటీ
ప్రాథమిక అంచనా మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రోడక్టివిటీ పెరిగిందని గణపతి సుబ్రమణియమ్ తెలిపారు. ఒకే కార్యాలయం నుండి అందరూ కలిసి ఎందుకు పని చేయాలనే అంశాన్ని కూడా ముందు ముందు పరిగణలోకి తీసుకుంటామని అభిప్రాయపడ్డారు.

రూ.37,702 కోట్ల డివిడెండ్
గత ఆర్థిక సంవత్సరంలో రూ.37,702 కోట్ల మేర డివిడెండ్ చెల్లించింది టీసీఎస్. ఈ మార్చి క్వార్టర్లో ఒక్కో షేర్‌కు రూ.12 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇప్పుడు రూ.6 తుది డివిడెండ్ కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్‌లో కంపెనీ మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.18కు పెరుగుతుంది. కార్యకలాపాల నిర్వహణలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ క్లయింట్లకు సంతృప్తికర స్థాయిలో ఐటీ సేవలు అందిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.
More From GoodReturns

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications