భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూకెలో వచ్చే మూడు సంవత్సరాల్లో 5,000 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ప్రకటించింది. ఇది యూకే ఆర్థిక వ్యవస్థలో TCS దీర్ఘకాల కట్టుబాటును చూపిస్తుంది. అంతేకాక, TCS లండన్‌లో AI ఎక్స్‌పీరియెన్స్ జోన్ మరియు డిజైన్ స్టూడియోని కూడా ప్రారంభించింది. కొత్త సౌకర్యం ఆవిష్కరణలకు, క్లయింట్లతో కొత్త ప్రాజెక్ట్స్ పై పనిచేయడానికి ఒక కేంద్రంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
TCS కు యూకెలో 50 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇది సుమారు 42,000 ఉద్యోగాలను ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కలిగి ఉంటుంది. కొత్త లండన్ సౌకర్యం TCS ఫ్లాగ్‌షిప్ పేస్‌పోర్ట్ సెంటర్స్ మాదిరిగానే రూపుదిద్దబడింది. అకడమిక్ ఇనిస్టిట్యూషన్స్, స్టార్టప్స్ మరియు ఇండస్ట్రీ పార్ట్‌నర్లతో కలిసి యూకెలో AI వినియోగాన్ని వేగవంతం చేయడమే లక్ష్యం.

TCS లండన్‌లో ప్రారంభించిన AI ఎక్స్‌పీరియెన్స్ జోన్లో మెషీన్ లెర్నింగ్, జనరేటివ్ AI, రోబోటిక్స్, క్లౌడ్ AI, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలు ఉంటాయి. ఈ సౌకర్యం SMEs, స్టార్టప్స్, పెద్ద కంపెనీలకు AI ను సులభంగా వాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త ఆవిష్కరణలు, ప్రాజెక్ట్‌లపై సహకారం, ప్రాక్టికల్ ట్రైనింగ్ లాంటి అవకాశాల ద్వారా సంస్థలు తమ AI సామర్థ్యాలను పెంచుకోవచ్చు. TCS యూకెలో ప్రారంభిస్తున్న AI ఎక్స్‌పీరియెన్స్ జోన్ భారతదేశానికి మరియు భారతీయులకు కూడా లాభంగా ఉంటుంది. TCS భారతీయ కంపెనీ కాబట్టి యూకేలో సృష్టించే కొత్త ఉద్యోగాల్లో కొంత భాగం భారతీయ నిపుణులకు కూడా అందవచ్చు. అదేవిధంగా, రిమోట్ వర్క్ ద్వారా భారతదేశంలో నుండీ AI, డేటా అనలిటిక్స్ మరియు ఇతర టెక్నాలజీ పనులు చేయవచ్చు, దాంతో భారత నిపుణులకు అంతర్జాతీయ అనుభవం మరియు అవకాశాలు లభిస్తాయి.
యూకే ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి జేసన్ స్టాక్‌వుడ్ TCS కు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర ఉందని చెప్పారు. టాటా గ్రూప్ సుమారు 150 ఏళ్లుగా తన నాయకత్వం, వ్యాపారం, ఫిలాన్ద్రోపీ ద్వారా ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు మనం జూలైలో కుదర్చిన ట్రేడ్ డీల్ ద్వారా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలపరిచాం. TCS మరియు టాటా గ్రూప్ వంటి కంపెనీలు ఉద్యోగాలు సృష్టించడంలో, ఆర్థిక వృద్ధిని పెంచడంలో, ప్రజల వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తాయి.
ముంబైలోని "బన్యన్ పార్క్ క్యాంపస్ లో UK ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ బిజినెస్ డెలిగేషన్‌తో కలిసి, TCS నాయకత్వం "ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్" నివేదికను ప్రారంభించింది. ఆ నివేదికలో FY2024 లో TCS యూకే ఆర్థిక వ్యవస్థకు £3.3 బిలియన్లు సమకూర్చిందని, £780 మిలియన్ పన్నులు చెల్లించిందని, ఇది సుమారుగా 20,400 ఉపాధ్యాయుల జీతాల సమానం అని తెలిపింది. అంతేకాక, 19 యూకే సైట్‌లలో ప్రత్యక్షంగా లేదా సప్లై చైన్ ద్వారా 42,700 ఉద్యోగాలు మద్దతు పొందినట్లు, వీటిలో 15,300 టెక్నాలజీ ఉద్యోగాలు ఇంజినీరింగ్ మరియు డేటా అనలిటిక్స్‌లోని ఉద్యోగాలు అని పేర్కొన్నారు. ఇది యూకే ఆర్థిక నష్టాన్ని £1.5 బిలియన్ తగ్గించడంలో కీలకమని చెప్పారు.
PAC ప్రిన్సిపల్ అనలిస్ట్ నిక్ మేయెస్ "TCS నుండి తాజా పెట్టుబడి, యూకేలో కీలక డిజిటల్ సర్వీసుల ప్రధాన ప్రొవైడర్‌గా TCS స్థానం మరింత బలపడుతుంది. ఇది వివిధ ఇండస్ట్రీ సెక్టర్లలో క్లయింట్‌లకు AI వినియోగంలో మద్దతు ఇస్తూ, ట్రాన్స్‌ఫర్మేషనల్ ప్రోగ్రామ్స్‌ను సపోర్ట్ చేస్తుంది అని అన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications