కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వివధ రంగాల్లోని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం లేదా ఉద్యోగాల్లో కోత విధించడం చేస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను వేతనాలు పెంచుతున్నాయి లేదా బోనస్‌లు అందిస్తున్నాయి. అదే కోవలోకి వస్తోంది ప్రముఖ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల కంపెనీ టీసీజీ లైఫ్ సైన్సెస్.

ఈ కంపెనీలో కొత్త ఉద్యోగాలు, బోనస్
ఈ ఆర్థిక సంవత్సరంలో (2020-21) తమ ఉద్యోగుల సంఖ్యను 15% మేరకు పెంచుకోవడానికి టీసీజీ లైఫ్ సైన్సెస్ కసరత్తు చేస్తోంది. అదే సమయంలో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మొత్తం వార్షిక బోనస్‌ను విడుదల చేసినట్లు కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు ఇటీవల తెలిపారు. పూర్ణేందు చటర్జీ గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఈ ఏడాది తమ ఉద్యోగుల పని తీరు మదింపు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది.

1500 మంది ఉద్యోగులకు 100 శాతం వార్షిక బోనస్
తాము హైదరాబాదులోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు కోల్‌కతాలోని ఆర్ అండ్ డీ సెంటర్‌లో పని చేస్తున్న తమ కంపెనీలోని 1500 మంది ఉద్యోగులకు 100 శాతం వార్షిక బోనస్ విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు, కొత్త నియామకాల కోసం హైరింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలిపింది.

భద్రతా చర్యలతో మూడు షిఫ్టులుగా..
డ్రగ్ పరిశోధనలోని ఈ సంస్థ కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ, ఉద్యోగుల కోసం ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకుంటూ శ్రామిక శక్తిని మూడు షిఫ్టులుగా విభజించింది. ఆటుపోట్ల ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో కార్యాలయాలు మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. తమ లీడర్‌షిప్ టీమ్, నిబద్దత కలిగిన ఉద్యోగులు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications