Income Tax: పాత, కొత్త టాక్స్ విధానాల కింద ఈ డిడక్షన్స్ లభిస్తాయని మీకు తెలుసా..? తెలుసుకోండి
Income Tax: మార్చి నెల ముగియటంతో చాలా మంది తమ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే హడావిడిలో ఉన్నారు. అయితే ఫిబ్రవరిలో జరిగిన వార్షిక బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. కొత్త టాక్స్ విధానం కింద రూ.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ సారి టాక్స్ పేయర్స్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం కొత్త టాక్స్ విధానాన్ని డీఫాల్ట్ పన్ను విధానంగా ఉంచింది. అంటే ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో మీరు ఎలాంటి టాక్స్ పద్ధతిని ఎంపిక చేసుకోకపోతే అది ఆటోమెటిక్ గా కొత్త టాక్స్ విధానం కిందకు వస్తుంది. ఈ క్రమంలో పన్ను ఆదా చేసుకునేందుకు పాత్ టాక్స్ విధానం కింద ఉన్న చాలా మార్గాలు కొత్త దానిలో లేవు కాబట్టి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

హోమ్ లోన్ వడ్డీకి తగ్గింపు..:కొత్త టాక్స్ విధానంలో టాక్స్ పేయర్స్ అద్దెకు ఇచ్చిన ఇంటి నిర్మాణానికి తీసుకున్న గృహ రుణానికి చెల్లిస్తున్న వడ్డీ విషయంలో పన్ను ఆదా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. ఇదే క్రమంలో వస్తున్న అద్దె కంటే చెల్లిస్తున్న వడ్డీ ఎక్కువగా ఉన్నట్లయితే దానిని మినహాయింపుగా పొందటానికి ఆదాయపుపన్ను శాఖ అనుమతించటం లేదు. ఇదే సమయంలో టాక్స్ పేయర్ తాను నివసిస్తున్న ఇంటికి చెల్లించే హోమ్ లోన్ రుణాన్ని మాత్రం పన్ను రాయితీగా తిరిగి పొందటం కొత్త పన్ను విధానం కింద కుదరదని గుర్తుంచుకోవాలి. అయితే పాత టాక్స్ విధానం కింద పైన పేర్కొన్న నిబంధనలకు సైతం పన్ను రాయితీ లభిస్తోంది.
గ్రాట్యుటీ ఆదాయంపై టాక్స్..:ఎవరైనా ఉద్యోగి ఒకే సంస్థలో 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసినట్లయితే వారు గ్రాట్యుటీ పొందటానికి అర్హలు. అయితే ఉద్యోగి అకాల మరణం లేదా వైకల్యం పొందిన సమయంలో ఇది వర్తించదని చట్టం వెల్లడించింది. దీని ద్వారా రూ.20 లక్షల వరకు వచ్చే అదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. గతంలో ఈ మినహాయింపు పరిమితి కేవలం రూ.10 లక్షలుగా ఉంది. కొత్త పన్ను విధానం కింద దీనిని టాక్స్ పేయర్స్ పొందవచ్చు.

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు..:కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు పెయిడ్ లీవర్స్ సౌకర్యాన్ని కంపెనీలు అందిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో వాడుకోని సెలవులను ఎన్‌క్యాష్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు పన్ను మినహాయింపు ఉండగా.. ప్రైవేట్ ఉద్యోగులు ఏప్రిల్ 1, 2023 నుంచి రూ.25 లక్షల వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇది కొత్త టాక్స్ విధానం కింద కూడా అందుబాటులో ఉండుందని టాక్స్ పేయర్స్ గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications