Tax Deduction: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి దాదాపు 2 రోజులు మాత్రమే ఇంకా గడువు ఉంది. ఈ క్రమంలో ముందుగా వేతనజీవుల చూపు ఆదాయపు పన్ను రేట్ల తగ్గింపు నుంచి అదనపు ప్రయోజనాలపై ఆర్థిక మంత్రి చేసే ప్రకటనలపైనే కొనసాగుతోంది.
కొత్త పన్ను విధానం కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గడచిన కొన్ని వార్షిక బడ్జెట్ ప్రసంగాల సమయంలో కొన్ని డిడక్షన్లు, మినహాయింపులను అందిస్తూ వచ్చారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు న్యూ టాక్స్ రీజిమ్ కింద స్టాండర్డ్ డిడక్షమ్ మెుత్తాన్ని కూడా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ 3.0 ప్రభుత్వంలో అధిక ద్రవ్యోల్బణం, మారుతున్న వినియోగ ధోరణుల నేపథ్యంలో పన్ను రేట్లలో తగ్గింపులు, అధిక మినహాయింపు పరిమితుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న టాక్స్ పేయర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ప్రజలపై భారం పెరుగుతోంది. ఈ క్రమంలో సంపాదనలు ఆ స్థాయిలో పెరగకపోవటం, ఖర్చు చేయటానికి తగిన ఆదాయం ఉండక పోవటం వంటి సమస్యలకు కొత్త పన్ను విధానం కింద ఉపశమనాలకు దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో రానున్న బడ్జెట్‌లో HRAను చేర్చడం, సెక్షన్ 80C పన్ను మినహాయింపుల పెంపుతో పాటు స్టాండర్ట్ డిడక్షన్ రూ.లక్ష వరకు పెంచాలని ఆర్థిక నిపుణులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన వేళ ఈ చర్యలు ప్రజల కొనుగోళ్లను మెరుగుపరుస్తాయని వారు చెబుతున్నారు.
వాస్తవానికి మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో 2020 వార్షిక బడ్జెట్లో కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టబడింది. ఇది అంతకు ముందు ఉన్న పాత పన్ను విధానానికి ప్రత్యామ్నాయంగా తీసుకురాబడింది. చాలా మంది ఇప్పటికీ పాత పన్ను విధానాన్ని ఫాలో కావటానికి అసలు కారణం అందులో వివిధ సెక్షన్ల కింద లభిస్తున్న పన్ను రాయితీలేనని ఒప్పుకోవాల్సిన నిజం. ప్రస్తుతం రెండు పన్ను విధాల కింద స్టాండర్డ్ డిజక్షన్ అందించబడుతోంది. వేతన జీవులకు పాత పన్ను విధానం కింద ఇది రూ.50,000 వరకు ఉండగా.. కొత్త పన్ను విధానం కింద 2024 బడ్జెట్ ప్రసంగంలో పెంచిన తర్వాత రూ.75,000కు చేరుకుంది.
చాలా మంది పన్ను చెల్లింపుదారులు సహజంగా వినియోగించుకునేది సెక్షన్ 80సీ డిడక్షన్స్. పాత పన్ను విధానం కింద దీనికి రూ.1.50 లక్ల వరకు గరిష్ఠ మినహాయింపు లభిస్తుంది. ఇది పన్ను చెల్లింపుదారుల బాధ్యతను తగ్గించటంలో దోహదపడుతుంది. ఇదే క్రమంలో హోమ్ లోన్ కోసం చెల్లించే వడ్డీ విషయంలోనూ రూ.50,000 వరకు సెక్షన్ 80ఈఈ కింద మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందటానికి అవకాశం కల్పిస్తోంది. తాజాగా అమెరిక అధ్యక్షుడు సైతం ప్రజలపై ఎలాంటి ఆదాయపు పన్ను విధించకూడదని భావిస్తున్నట్లు కామెంట్ చేయటం కూడా ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారం ప్రభావాన్ని నిరూపిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications