పెట్టుబడులకు రియల్ ఎస్టేట్, బంగారాన్ని మంచి సాధనంగా భావిస్తారు చాలామంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది కాలంగా రియాల్టీ పెట్టుబడులు ప్రతికూలంగా మారాయి. మరోవైపు బంగారం దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తే ఆకర్షణీయంగా ఉండే అవకాశాలు తక్కువ. బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాలు ఎక్కువగా సొంతం కోసం వినియోగించుకుంటారు. అయితే ఇది వ్యాపారం కూడా.
వీటిల్లో పెట్టుబడులు కొన్ని సందర్భాల్లో ఆకర్షణీయమైతే, మరిన్ని సందర్భాల్లో అర్థవంతంగా కనిపించదు. మీరు బంగారం, రియాల్టీ పైన పెట్టుబడులు పెట్టే సమయంలో పన్నులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రెండు సాధనాలపై స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో వర్తించే పన్నులు ఇక్కడ చూడండి.

బంగారంపై అప్పుడు పెట్టుబడి పెడితే...
చాలామంది ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్, బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. వీటిని సురక్షిత పెట్టుబడులుగా చెప్పవచ్చు. కరోనాకు ముందు ఇన్వెస్ట్ చేసిన వారు కరోనా సమయంలో భారీగా లాభాలను ఆర్జించారు. అయితే బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200కు చేరుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసిన వారు మాత్రం నష్టపోయినట్లే. ఇప్పుడు బంగారం ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 వరకు తక్కువగా ఉంది. సుదీర్ఘ కాలంలో మంచి రాబడికి బంగారం అంతగా సానుకూలం అయ్యే అవకాశాలు తక్కువ.

రియాల్టీపై ఇన్వెస్ట్‌మెంట్
రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేస్తే అత్యంత సురక్షితమైనదిగా ఎంతోమంది ఇన్వెస్టర్లు భావిస్తారు. కొన్ని సమయాల్లో రియాల్టీ పడిపోయినప్పటికీ కొద్ది కాలానికి తిరిగి పుంజుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రియాల్టీ పైన్ ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు.

బంగారం, రియాల్టీ పన్ను రేటు
మూడేళ్లకు పైగా కాలపరిమితిని లాంగ్ టర్మ్‌గా పేర్కొంటారు. గోల్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్లాబ్ రేట్‌ను అనుసరించి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20.8 శాతం. సావరీన్ గోల్డ్ బాండ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20.8 శాతం. రియాల్టీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20.8 శాతం.


Click it and Unblock the Notifications