Tax News: వామ్మో ఇన్ని టాక్సులా..? కారు కొన్న వ్యక్తి చేసిన ట్వీట్ వైరల్..
Nirmala Sitharaman: దేశంలో భారీగా ఉన్న పన్నులపై నిపుణుల నుంచి సామాన్యుల వరకు అందరూ స్పందిస్తూనే ఉన్నారు. వాస్తవానికి వ్యక్తిగత ఆదాయపు పన్నుల విషయంలో చాలా దేశాల కంటే ఇండియాలో రేట్లు అధికంగా ఉన్నాయనే విషయాన్ని వారు హైలైట్ చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రశ్నలు అందరినీ భారతీయ పన్ను వ్యవస్థపై తిరిగి ఆలోచించేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే సదరు వ్యక్తి ఒక కారు కొనుగోలుకు సంబంధించిన బిల్లును అందులో పంచుకున్నాడు. ఇందులో మహీంద్రా సంస్థకు చెందిన XUV700 డీజిల్ మోడల్ కి సంబంధించిన బిల్లును పంచుకున్నాడు. బిల్లులో కారు ధరతో పాటు ఎలాంటి పన్నులు విధించబడ్డాయనే వివరాలు అందించబడ్డాయి.

ముందుగా కారు మెుత్తం ధర ఇందులో రూ.21.59 లక్షలుగా పేర్కొనబడింది. దీనిలో వాస్తవంగా కారు ధర రూ.14,58,783.78గా పేర్కొనబడింద. ఈ ధరపై స్టేట్ జీఎస్టీ 14 శాతం రూ.2,04,229.73గా ఉండగా.. సెంట్రల్ జీఎస్టీ 14 శాతం రూ.2,04,229.73 విధించబడింది. దీనికి అధనంగా జీఎస్టీ సెస్ రూపంలో మరో 20 శాతం రూ.2,91,756.76గా పేర్కొనబడింది. వాస్తవ కారు ధరలపై ఇవన్నీ కలిపినప్పుడు రూ.21,59,000గా లెక్కించబడింది. ఇక్కడ ఒక కారు కొనటానికి ప్రజలు ఏకంగా 48 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోందని వెల్లడైంది.
48% tax on buying a car, and that’s after already paying 31.2% income tax. What is this, @FinMinIndia? Is there no limit to this daylight robbery? Your incompetence and inefficiency are dragging India backward. This is absolutely shameful! pic.twitter.com/uyyDUCMrHi
— Venkatesh Alla (@venkat_fin9) January 28, 2025
దేశంలోని ప్రజలు ప్రభుత్వానికి వారు సంపాదిస్తున్న సంపదపై ముందుగా 31.2% వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. ఇంత పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన ఆదాయంతో కారును కొంటుంటే మళ్లీ దానిలో 48 శాతం కేవలం పన్నులకే చెల్లించాల్సి రావటంపై వెంకటేష్ అల్ల అనే యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి డబ్బు ఇంత స్థాయిలో దోచుకుంటోందని, దీనికి అంతం లేదా అంటూ సదరు యూజర్ ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించాడు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ అసమర్థత భారతదేశాన్ని వెనక్కి లాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలా ప్రజలను లూటీ చేయటం పూర్తిగా సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా కాలంగా ప్రజలను ప్రభుత్వం లూటీ చేస్తోందని ఇంత భారీ స్థాయిలో పన్నులను భారతదేశంలో ప్రజలపై వసూలు చేయటాన్ని చాలా మంది నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. కార్పొరేట్ పన్నుల కంటే వ్యక్తిగత పన్నుల తగ్గింపు చాలా ముఖ్యమైన అంశంగా వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications