FirstCry News: ఇటీవలి కాలంలో పన్ను అధికారులు చాలా చురుకుగా ఉంటున్నారు. నూతన సాంకేతికత, ఏఐ సాధనాలను వినియోగిస్తూ పన్ను ఎగవేతలను, అక్రమాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా స్టార్టప్ కంపెనీల్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్లపై వీరు దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుతం పన్ను అధికారులు మూడు భారతీయ స్టార్టప్ యునికార్న్స్ ఫస్ట్‌క్రై, గ్లోబల్‌బీస్ బ్రాండ్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వ్యవస్థాపకులు పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని పన్ను శాఖ ఫస్ట్‌క్రై వ్యవస్థాపకుడు సుపమ్ మహేశ్వరికి నోటీసులు పంపించింది. ప్రైవేటుగా నిర్వహిస్తున్న ఫస్ట్‌క్రైలో ఈక్విటీ లావాదేవీల విషయంలో 50 మిలియన్ డాలర్లకు పైగా పన్నులు చెల్లించకపోవటంపై ప్రశ్నిస్తున్నారు.

ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్‌క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కో, సునీల్ భారతి మిట్టల్ కుటుంబ కార్యాలయంతో సహా ఫస్ట్‌క్రైలోని ఆరుగురు ఇన్వెస్టర్లు కూడా ఈ విషయానికి సంబంధించిన విచారణ నోటీసులు అందుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను పరిష్కరించుకునేందుకు మహేశ్వరి పన్ను శాఖతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నివేదికల ప్రకారం అనేక సంవత్సరాల నష్టాల తర్వాత మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ క్రై లాభదాయకంగా మారింది. బేబీ, మెటర్నిటీ వేర్ రిటైలర్ వచ్చే ఏడాది పబ్లిక్ మార్కెట్‌లోకి ఐపీవోను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిని సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ సీఎఫ్ఓ నవనీత్ గోవిల్ ధృవీకరించారు. గతవారం సాఫ్ట్ బ్యాంక్ FirstCryలో 1.5- 2 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు మణిపాల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్ ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆయన FirsCryలో సుమారు రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications