TDS Deductions: ఆదాయపు పన్ను అధికారుల నుంచి చాలా మందికి అనేక కారణాల వల్ల నోటీసులు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఒక ముఖ్యమైన కారణం గురించి చాలా మంది తప్పక తెలుసుకోవాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే..
పన్ను రిటర్న్స్ దాఖలు చేయని వ్యక్తులకు ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుందని సమాచారం. వాస్తవానికి మూలం వద్ద ఆదాయపు పన్ను మినహాయించబడిన వారికి కూడా నోటీసులు పంపబడనున్నాయి. అయితే కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు.

పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం, వాపసు వ్యవధిని తగ్గించడం నుంచి నవీకరించబడిన రిటర్న్‌ల వరకు లేదా పెద్ద పన్ను వివాదాన్ని పరిష్కరించడంపై డిపార్ట్‌మెంట్ దృష్టి ఉందని నితిన్ గుప్తా వెల్లడించారు. సీబీడీటీ మైసూరులో ఏర్పాటు చేసిన డిమాండ్ మేనేజ్‌మెంట్ సెంటర్ ద్వారా రూ.కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారించిందని వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులు అంగీకరించిన నిర్దిష్ట సమయంలోవారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మదింపు అధికారులు, పన్ను చెల్లింపుదారులను ఒకచోట చేర్చారు. రెండు వైపుల నుంచి అసెస్‌మెంట్‌ను పరిష్కరించడానికి ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రం గతంలో కేవలం కర్ణాటకకు చెందిన వివాదాలను పరిష్కరించేందుకు మాత్రమే పరిమితమైంది. అయితే ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా కేసులను పరిష్కరిస్తోందని గుప్తా చెప్పారు. 2024 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.25,000 వరకు ఉన్న పన్ను డిమాండ్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. చిన్నపాటి, ధృవీకరించబడని, రాజీపడని లేదా వివాదాస్పదమైన ప్రత్యక్ష పన్ను డిమాండ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. వాటిలో చాలా వరకు 1962 సంవత్సరం నాటివని, అవి పుస్తకాల్లో కొనసాగుతూనే ఉన్నాయని, నిజాయితీ పన్ను చెల్లింపుదారులకు ఆందోళన కలిగిస్తోందని, అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆమె వెల్లడించారు.
"2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.25,000 వరకు, 2010-11 నుండి 2014-15 ఆర్థిక సంవత్సరాలకు రూ.10,000 వరకు ఉన్న అటువంటి ప్రత్యక్ష పన్ను డిమాండ్లను ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇది దాదాపు కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం అందిస్తుందని భావిస్తున్నాట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications