Income Tax Return: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి వ్యక్తులు చెల్లించే పన్నులు కూడా ఉంది. అయితే పన్ను యంత్రాంగం ఎగవేతదారులను పట్టుకునేందుకు పాత పద్దతులతో పాటు కొత్త సాంకేతికతను కూడా ఉపయోగిస్తూ అక్రమాలను అరికట్టే పనిలో ఉంది.
ఇటీవలి కాలంలో చాలా మంది వ్యక్తిగత పన్నుల భారాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తున్న ఘటనలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్ టెక్కీలు పన్నును తప్పించుకునేందుకు కొన్ని అనామక రాజకీయ పార్టీలకు ఫండ్ ఇచ్చి తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నట్లు ఇటీవల ఐటీ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తప్పుడు క్లెయిమ్స్ నిరోధించటానికి పన్ను డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటోంది.

అయితే ఈ పన్ను ఎగవేత సమస్య అనేక సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతితతో పాటు ఏఐ టెక్నాలజీని ఆదాయపు పన్ను శాఖ వినియోగించటం పెంచేసింది. తద్వారా అనుమానాస్పద కేసులను గుర్తించటం, తప్పుడు పన్ను క్లెయిమ్స్ గుర్తించి సదరు వ్యక్తులు లేదా సంస్థలకు ఐటీ నోటీసులు జారీ చేసేందుకు AI సహాయకారిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇది బేసిక్ స్థాయిలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో అధునాతన నమూనాలతో పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, అక్రమ కార్యకలాపాలను నిరోధించటానికి ఉపయోగించబడుతుందని పన్ను శాఖ చెబుతోంది.
దీని గురించి డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్న్‌లలో చేసిన తప్పుడు క్లెయిమ్‌లను పట్టుకోవడానికి AIని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.10,000 ఇంటి అద్దె చెల్లించినట్లు చూపుతూ మినహాయింపును క్లెయిమ్ చేసినట్లయితే ఆ సమయంలో యజమానికి సంబంధించిన పాన్ వివరాలను కూడా అందిస్తాడు. ఏఐ ద్వారా సదరు యజమాని వార్షిక ఆదాయంలో దీనిని చూపుతున్నారా లేదా నిజంగానే డబ్బు చెల్లించబడిందా వంటి క్రాస్ వెరిఫికేషన్ ప్రక్రియను ఏఐ ద్వారా పన్ను శాఖ నిర్వహిస్తుంది. ఇక్కడ పాన్ కార్డు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించబడతాయి. ఇలాంటి వేలాది కేసులను ఈ ఏడాది పన్ను శాఖ గుర్తించింది.
ఇదే తరహాలో చాలా మంది పిల్లల ట్యూషన్ ఫీజులను కూడా అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ ఫైలింగ్ సమయంలో పేర్కొనే పెట్టుబడులు, ఇన్సూరెన్స్ పాలసీ చెల్లింపులు సహా ఇతర మినహాయింపుల వివరాలను సైతం ఏఐ ద్వారా సమాచారాన్ని అధికారులు పోల్చి చూస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఏడాదిలో తన ఆదాయం కంటే ఎక్కువగా చేసే ట్రాన్సాక్షన్లపై కూడా అధికారులు గురిపెడుతున్నారు. కొందరు పన్ను పరిధిలోకి వచ్చినప్పటికీ వారు రిటర్న్స్
ఫైలింగ్ తప్పించుకుంటున్నట్లు దీని ద్వారా అధికారులు గుర్తిస్తున్నారు. బ్యాంకు ఖాతా నుండి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ చెల్లించి, తక్కువ రాబడిని క్లెయిమ్ చేయడం వంటివి అరికట్టాలని చూస్తున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications