గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో టాటా మోటార్స్ రూ.9,894 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆ సంస్థ నేతృత్వంలోని బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌పై కరోనా మహమ్మారి ప్రభావం పడటంతో దేశీయ వ్యాపారం కూడా డీలా పడింది. దీంతో నష్టం భారీగా పెరిగినట్లు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్‌లో రూ.1,117 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

ఆర్థిక సంవత్సరంలో నష్టాలు...
గత ఏడాది చివరి త్రైమాసికంలో ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం టాటా మోటార్స్ రూ.27.7 శాతం కోల్పోయి రూ.62,493కు పరిమితమైంది. మార్చి క్వార్టర్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సెగ్మెంట్‌లోనే నష్టాలు 501 మిలియన్ పౌండ్లుగా (రూ.4,775 కోట్లు) నమోదయ్యాయి. ఆదాయం 540 కోట్ల పౌండ్లు (రూ.51,500 కోట్లు) నమోదు చేసింది. ఇది పన్నుకు ముందు లాభాలు. మొత్తం ఆర్థిక సంవత్సరంలో (2019-20) టాటా మోటార్స్ నష్టాలు రూ.12,071 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.28,826.23 కోట్ల నష్టాలు నమోదుచేసింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్స్‌తో ఎక్కువ నష్టాలు
బలహీనమైన డిమాండ్, కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వంటి వివిధ కారణాలతో నష్టాలు నమోదు చేసింది టాటా మోటార్స్. గత క్వార్టర్‌లో అన్నింటి కంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ అమ్మకాలు నష్టాలపై ఎక్కువగా ప్రభావితం చేశాయి. చైనా, యూరోప్ వంటి కీలక మార్కెట్ దేశాలు లాక్ డౌన్‌లోకి వెళ్లాయి. సరఫరా గొలుసుకు అంతరాయం కలిగింది. కార్యకలాపాల ఆదాయం.. జేఎల్ఆర్ నికర నష్టం 42.2 పౌండ్లు (దాదాపు రూ.4,000 కోట్లు) కాగా, ఆదాయం రూ.2300 కోట్ల పౌండ్లు (రూ.2,19,000 కోట్లు) నమోదయింది.

నష్టాలకు కారణాలు
గత ఆర్థిక సంవత్సరంలో మందగమనం, లిక్విడిటీ స్ట్రెస్, స్టాక్స్ కరెక్షన్, BSVI మార్పు వంటి కారణాలతో అప్పటికే భారత్‌లో సేల్స్ పడిపోయాయి. దానికి కరోనా - లాక్ డౌన్ తోడు కావడం మరింత నష్టాలకు దారి తీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి క్వార్టర్ దాదాపు పూర్తిగా లాక్ డౌన్‌లో ఉండటంతో మరింత నష్టం ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications