ముంబై: దేశంలో వాహనాల ధరలు మరింత ప్రియం అయ్యాయి. వాటి ధరలకు రెక్కలు మొలిచాయి. ఒక తయారీ కంపెనీ తన కార్లు.. ఇతర వాహనాల ధరలను పెంచితే.. మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటోమొబైల్ సెక్టార్‌లో ఎప్పుడూ ఉండేదే. అదే ఆనవాయితీ ఇప్పుడు మళ్లీ కనిపించనుంది. ఇదివరకు మారుతి సుజుకి తన వాహనాల రేట్లను పెంచింది. ఇప్పుడు తాజాగా టాటా మోటార్స్ అదే బాటలో నడిచింది. రేట్లను పెంచినట్లు ప్రకటించింది.

ప్యాసింజర్ వాహన రేట్లకు రెక్కలు..
అన్ని రకాల ప్యాసింజర్ వాహనాల రేట్లను పెంచినట్లు టాటా మోటార్స్ తాజాగా ప్రకటించింది. తక్షణమే పెరిగిన ధరలను అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు టాటా మోటార్స్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని మోడల్స్ కార్ల రేట్లను పెంచినట్లు స్పష్టం చేసింది. 0.1 శాతం నుంచి 1.1 శాతం వరకు వాటి రేట్లను సవరించినట్లు వివరించింది. కార్ల తయారీలో వినియోగించే పరికరాలు, విడి భాగాల ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, దాని ప్రభావం వాహనాల తయారీపై పడిందని తెలిపింది.

ఇన్‌పుట్ భారాన్ని కొంతమేరకైనా..
ఈ నెల 18వ తేదీన మారుతి సుజుకి తన వాహనాల రేట్లను పెంచిన విషయం తెలిసిందే. మారుతి సుజుకిలో బేసిక్ కార్ మోడల్‌గా పేరున్న ఆల్టో మొదలుకుని ఎస్-క్రాస్ వరకు అన్ని వాహనాల రేట్లనూ సవరించింది. 3.15 నుంచి 12.56 లక్షల రూపాయల వరకు వాటి రేట్లు ఉన్నాయి. గత సంవత్సరం మారుతి సుజుకి యాజమాన్యం మూడు సార్లు కార్ల రేట్లను పెంచింది. జనవరి-1.4, ఏప్రిల్-1.6, సెప్టెంబర్-1.9 శాతం మేర పెంచింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఈ నెల వరకు తొమ్మిది శాతం మేరకు ధరలు పెంచింది.

మహీంద్ర అండ్ మహీంద్ర కూడా..
మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తన వాహనాల రేట్లను పెంచింది. దీనిపై ఈ నెల 14వ తేదీన ప్రకటన విడుదల చేసింది. ఒక్కో వాహనంపై అదనంగా 10,000 నుంచి 63,000 రూపాయల వరకు భారం పడింది. విడి భాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్‌పుట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే ఉద్దేశంతో- కార్లు, ఇతర వాహనాల రేట్లను పెంచబోతున్నట్లు స్పష్టం చేసింది. ఒక వాహనాన్ని తయారు చేయడానికి అవసరమైన స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, కాపర్, ఇతర విలువైన మెటల్స్ ధరలు భారీగా పెరిగాయని, ఆ భారాన్ని తాము మోయలేకపోతున్నాంటూ మారుతి సుజుకి ముందు నుంచీ చెబుతూ వస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications