Air India Jobs: టాటాల చేతికి ఎయిర్ ఇండియా తిరిగి చేరుకున్నతర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. తాజాగా ఖర్చులను తగ్గించేందుకు ఆధీనంలోని వివిధ ఎయిర్ లైన్ కంపెనీల ఆఫీసులను ఒకే దగ్గరకు మార్చుతున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో ఎంబీఏ పూర్తిచేసిన వారికి శుభవార్త చెప్పింది.

కొత్త కొలువుల నియామకాలు..
ఎయిరిండియాతో కలిసి పనిచేయడం సువర్ణావకాశం వచ్చేసింది. టాటా గ్రూప్‌కి చెందిన ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేస్తోంది. ఇందుకోసం ఎంబీఏ అర్హత కలిగినవారు ఉద్యోగాలకు అర్హులని ప్రకటించింది. అంటే మీరు MBA చిదివినవారైతే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్లకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జాబ్ అప్లికేషన్ కోసం 0-3 సంవత్సరాల అనుభవం ఉన్న వారందరూ అర్హులేనని కంపెనీ తెలిపింది.

దరఖాస్తు వివరాలు..
ఔత్సాహిక అభ్యర్థులు సెప్టెంబర్ 20, 2022 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ వర్టికల్స్‌లో.. వాణిజ్య, కస్టమర్ అనుభవం, ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సాంకేతికత, ఉత్పత్తులు ఉన్నాయి. దీని కోసం అభ్యర్థులు తప్పనిసరిగా MBA కలిగి ఉండాలి. దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు https://content.airindia.in/careers/currentopenings/12కి వెళ్లాలి.

వేగంగా వ్యాపార ప్రణాళికలు..
ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కంపెనీ తన మానవ వనరులను బలోపేతం చేయడంలో నిరంతరం నిమగ్నమై ఉంది. ఇటీవల టాటా గ్రూప్ పైలట్స్ , క్యాబిన్ సిబ్బందిని నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కంపెనీ మేనేజ్‌మెంట్ పోస్టు ఖాళీల భర్తీకి చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తోంది.

కొనుగోలు వివరాలు..
టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 8, 2021న అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసే బిడ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది. ఎయిర్ ఇండియా కమాండ్ ఇప్పుడు పూర్తిగా టాటా గ్రూప్ చేతిలో ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications