Tata Group: తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం కోసం ఏదైనా ప్రారంభించాలనుకునే వారికి దేశంలోని ప్రసిద్ధ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ అందిస్తోంది. అవును దీని కోసం మీరు టాటా గ్రూప్ కంపెనీలో భాగస్వామి కావాల్సి ఉంటుంది. టాటాలకు సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మసీ కంపెనీ 1MG ఈ సదవకాశాన్ని అందిస్తోంది.

ఆరోగ్య భాగస్వామి..
టాటా గ్రూప్ కు చెందిన ఫార్మసీ 1MG ఆరోగ్య భాగస్వాముల కోసం వెతుకుతోంది. తనతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తోంది. ఇందుకోసం మీరు టాటా గ్రూప్‌కు వ్యాపార భాగస్వామిగా పని చేయవచ్చు. 1MG తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ పేరు 1MG హెల్త్ పార్టనర్. దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి సరైన సేవలను అందించాలని కంపెనీ యోచిస్తోంది.
ఇందుకోసం కంపెనీ హెల్త్ కేర్ పార్టనర్లు కావాలని వెతుకుతోంది. ఇప్పటివరకు 600 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ భాగస్వాములు ఈ కార్యక్రమంలో చేరారు. మీరు కూడా ఈ ప్రోగ్రామ్‌లో చేరితే వేల రూపాయలు సంపాదించవచ్చు.

ప్రోత్సాహకాలు..
మీరు ఆరోగ్య భాగస్వామి అయినప్పుడు కంపెనీ మంచి ప్రోత్సాహకాలను అందజేస్తుంది. కంపెనీలో చేరిన తర్వాత, వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో మీకు సమాచారం అందించబడుతుంది. దీనితో పాటు టెక్నాలజీ, మార్కెటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు కూడా ఇవ్వబడతాయి.

చేయాల్సిన పని ఏమిటి..?
1MG ఆరోగ్య భాగస్వాములు లీడ్‌లను ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తారు. ఆరోగ్య భాగస్వాములుగా ఉన్నవారు ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి మందులు కొనుగోలు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ విషయాన్ని భాగస్వామి ప్రజలకు చెప్పాలి. 1ఎంజీ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారనే విషయాన్ని వివరించాల్సి ఉంటుంది. కస్టమర్లు అనేకమార్లు తిరిగి సంస్థ సేవలను పొందేలా ఈ భాగస్వాములు చేయాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
మీరు ఆరోగ్య భాగస్వామి కావాలనుకుంటే.. అందుకోసం ముందుగా Tata 1MG అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. భాగస్వామి అయ్యేందుకు అక్కడ అడిగిన అన్ని వివరాలను పూరించాలి. మీ ప్రొఫైల్ షార్ట్‌లిస్ట్ చేయబడితే, మీకు కంపెనీ నుండి కాల్ వస్తుంది. మీరు ప్లాట్‌ఫారమ్‌లో చేరాలనుకుంటే అందుకోసం రూ.15,000 రుసుము చెల్లించాలి. ఇవి తిరిగి చెల్లించబడవు. మొత్తం ప్రక్రియ కేవలం 7 రోజుల్లో పూర్తవుతుంది.

సంపాదన ఇలా..
ఇందులో చేరటం వల్ల సంపాదన ఎలా ఉంటుందనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. కంపెనీ అధికారికి వెబ్ సైట్ వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి అంటే హెల్త్ కేర్ పార్టనర్ నెలకు 300 ఆర్డర్‌లు పొంది అవి ఒక్కో ఆర్డర్ విలువ రూ.500 ఉన్నట్లయితే మొత్తం ఆర్డర్ రూ.1.50 లక్షలు అవుతుంది. ఆ ఆర్డర్‌లపై భాగస్వామికి రూ.7,650 కమీషన్ లభిస్తుంది. అలా ఆర్డర్లు పెరిగే కొద్ది ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా టౌన్ లో ఉన్న వ్యక్తి నెలకు సగటున 2000 ఆర్డర్లు చేయగలిగితే అతనికి సుమారు రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తుంది. అంటే ఇంటి వద్దనే కూర్చుని నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications