జ్యువెల్లరీ బ్రాండ్ తనిష్క్ పైన నెటిజన్లు మరోసారి ఫైర్ అయ్యారు. వివాదాస్పద యాడ్ రూపొందించారంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ తనిష్క్ అంటూ ట్విట్టర్ వెల్లువెత్తింది. దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో నీనాగుప్తా, నిమ్రత్ కౌర్, సయానీ గుప్తా, అలయా ఎఫ్. నటీమణులతో తనిష్క్ ఓ యాడ్ రూపొందించింది. ఇందులో జ్యువెల్లరీని ధరించిన వీరు తాము ఈసారి ఏ విధంగా పండుగ జరుపుకోబోతున్నామనే విషయాన్ని పంచుకున్నారు. ఇందులో టపాసులపై చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.

యాడ్.. కంట్రోవర్సీ ఇదే
ఈ దీపావళి పర్వదినం రోజున తాము పెద్ద మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేస్తానని నీనా, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకుంటానని నిమ్రత్, దీపావళి అంటే తనకు మిఠాయిలు, రుచికరమైన భోజనం, స్నేహితులు, కుటుంబం అంతా ఒక్కచోట చేరడమే గుర్తుకు వస్తుందన ఆలయ చెబుతుంది. ఆ తర్వాత నయానీ గుప్తా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తాను దీపావళి పండుగ రోజు తన తల్లిని కలవనున్నానని, ఇందుకు సంతోషంగా ఉందని, టపాసులు లేకుండా దీపావళి జరుపుకుంటానని, దివ్వెలు మాత్రమే వెలిగిస్తానని చెబుతుంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు
దీపావళి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చెప్పడానికి మీరు ఎవరు అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇదివరకే ఓసారి ఇలా యాడ్ తీసిందని, తనిష్క్ ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి యాడ్స్ చేస్తూ తమ వర్గాన్ని టార్గెట్ చేస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాల జోలికి ఎలా వెళ్తారని మరికొందరు ప్రశ్నించారు. చిత్ర నిర్మాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి... కమర్షియల్ యాడ్స్ ద్వారా సంప్రదాయాలను చంపే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పండుగను ఉపయోగించుకొని తమ సేల్స్ పెంచుకోవడానికి అదే పండుగపై దుష్ప్రచారం చేస్తున్నారని మరికొందరు మండిపడ్డారు. ఓ వర్గం సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.

దిగి వచ్చిన తనిష్క్
నెటిజన్ల సహా అందరి నుండి తీవ్ర ఆగ్రహావేశాలు రావడంతో తనిష్క్ జ్యువెల్లరీ ఈ యాడ్‌ను సామాజిక మాద్యమాల నుండి తొలగించింది. బాయ్‌కాట్ తనిష్క్ ట్రెండ్ కావడంపై మరికొందరు స్పందిస్తూ.. ఇలాంటి ప్రకటనలను తమను టార్గెట్ చేస్తున్నాయని చెప్పడం సరికాదని మరికొందరు అంటున్నారు. తనిష్క్ మెసేజ్‌లో తప్పేముందని కొందరు అంటున్నారు. అయితే ఓ వర్గం పండుగ సమయంలో ఇలాంటి ప్రకటనలు ఇచ్చే సంస్థలు.. ఇతరుల విషయాల్లోను ఇలాంటివి పాటిస్తాయా అని ప్రశ్నించేవారు లేకపోలేదు.


Click it and Unblock the Notifications