For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా టీ రవిశంకర్, కనుంగో స్థానంలో..

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డిప్యూటీ గవర్నర్‌గా టి ర‌వి శంక‌ర్‌ను నియ‌మించింది కేంద్ర కేబినెట్ నియామ‌కాల క‌మిటీ. ఆయన మూడేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొనసాగుతారు. ప్ర‌స్తుతం ర‌వి శంక‌ర్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. గ‌త నెల రెండో తేదీన ఎస్పీ క‌నుంగో రిటైర్ అనంతరం ఈ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ ఖాళీగా ఉంది.

ర‌విశంక‌ర్‌తో పాటు ఇప్పటికే మ‌హేష్ కుమార్ జైన్, మైఖేల్ పాత్రా, రాజేశ్వ‌ర రావు ఆర్బీఐ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్‌లుగా ఉన్నారు. ఎక్స్‌చేంజ్ రేట్ మేనేజ్మెంట్‌, రిజ‌ర్వ్స్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్‌, ప‌బ్లిక్ డెట్ మేనేజ్మెంట్‌, మానిట‌రీ ఆప‌రేష‌న్ల‌లో ర‌విశంక‌ర్‌కు పట్టు ఉంది.

T Rabi Sankar appointed RBI Governor, to succeed B P Kanungo

ఆపాయింట్మెంట్ కమిటీ రవిశంకర్ అపాయింట్మెంట్‌ను ఖరారు చేసింది. ఎస్పీ కనుంగో ఏప్రిల్ 2, 2021న రిటైర్ అయ్యారు. కేంద్ర బ్యాంకు కార్యకలాపాలకు సంబంధించి రవిశంకర్‌కు దశాబ్దాల అనుభవం ఉంది. అతను 1990 సెప్టెంబర్‌లో ఆర్బీఐ రీసెర్చ్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు.

English summary

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా టీ రవిశంకర్, కనుంగో స్థానంలో.. | T Rabi Sankar appointed RBI Governor, to succeed B P Kanungo

The appointments committee of the Union Cabinet on Sunday confirmed T. Rabi Sankar for the post of deputy governor of the Reserve Bank of India (RBI). Sankar currently serves as the executive director in charge of payments and settlement.
Story first published: Monday, May 3, 2021, 8:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X