2025 ముగిసింది. కొత్త ఏడాది వచ్చేసింది. మరి న్యూ ఇయర్ అంటే మన దేశంలో హడావిడి మామూలుగా ఉంటుందా!? పాతఏడాదికి ఘనంగా వీడ్కోలు చెబుతూ.. న్యూ ఇయర్ 2026ని ఆహ్వానించే క్రమంలో భారతీయులు ఫుడ్ విషయంలో అస్సలు తగ్గలేదు. ట్రాఫిక్ జామ్‌లు, పార్టీ హడావిడి మధ్యలో కూడా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు ఆర్డర్లతో హోరెత్తిపోయాయి. ముఖ్యంగా స్విగ్గీ (Swiggy) షేర్ చేసిన గణాంకాలు చూస్తుంటే, మనవాళ్లకి బిర్యానీ మీద ఉన్న ప్రేమ మరోసారి నిరూపితమైంది. అసలు ఈ సారి న్యూ ఇయర్ (new year) పార్టీలు ఎలా జరుపుకున్నారో ఓ లుక్కేద్దాం!

బిర్యానీ మళ్లీ 'కింగ్' అని నిరూపించుకుంది!
డిసెంబర్ 31 సాయంత్రం కనీసం 7:30 గంటలు కూడా దాటకముందే దేశవ్యాప్తంగా 2,18,993 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. "ఇంకా రాత్రి కాకముందే ఇన్ని ఆర్డర్లా.. బిర్యానీ నిజంగా కింగ్" అంటూ స్విగ్గీ తన 'X' ఖాతాలో పోస్ట్ చేసింది. కేవలం బిర్యానీ మాత్రమే కాదు, రాత్రి 9 గంటల సమయానికి 90,000 పైగా బర్గర్లు కూడా డెలివరీ అయ్యాయి. అయితే ఈ ట్రెండ్స్ ఒక్కో సిటిలో ఒక్కోలా ఉన్నాయి.
బెంగళూరులో హెల్త్ కాన్షియస్.. కొందరికి కిచిడీనే ముద్దు!
దేశమంతా బిర్యానీ కోసం ఎగబడుతుంటే.. టెక్ సిటీ బెంగళూరులో మాత్రం సీన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అక్కడ సుమారు 2,000 మంది న్యూ ఇయర్ వేడుకల వేళ సలాడ్స్ ఆర్డర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరికొందరు మాత్రం అసలైన 'కంఫర్ట్ ఫుడ్' కిచిడీని నమ్ముకున్నారు. సుమారు 9,000 మంది కిచిడీ ఆర్డర్ చేయగా.. "వీళ్లంతా రాత్రి 10 గంటలకే పడుకునేలా ఉన్నారు" అని స్విగ్గీ సరదాగా వ్యాఖ్యానించింది. ఇక స్వీట్స్ విషయానికి వస్తే.. 8,000 మంది వేడివేడి 'గాజర్ కా హల్వా'తో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
ద్రాక్ష పళ్లకు ఎందుకు అంత డిమాండ్? (12 Grapes Trend)
ఈ న్యూ ఇయర్ వేళ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) వంటి యాప్స్‌లో ద్రాక్ష పళ్లు.. అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. దీనికి కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక స్పెయిన్ సంప్రదాయం. అదే.. 12 గ్రేప్స్ ట్రెండ్! అంటే రాత్రి 12 గంటల సమయానికి.. ముందుగా ప్రతి సెకనుకు ఒక ద్రాక్ష పండు చొప్పున మొత్తం 12 ద్రాక్ష పళ్లు తింటే రాబోయే 12 నెలలు అదృష్టం కలిసి వస్తుందని ఒక నమ్మకం. ఈ వైరల్ ట్రెండ్ వల్ల ప్రజలు కిలోల కొద్దీ ద్రాక్షలు ఆర్డర్ చేయడంతో స్టాక్ నిమిషాల్లో ఖాళీ అయిపోయింది.
కోట్ల మంది సెలబ్రేషన్స్!
మొత్తంగా చూస్తే.. ఈ ఏడాది సుమారు 7 కోట్ల మంది తమ ఆత్మీయుల కోసం ఫుడ్ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. పలావ్ నుంచి పిజ్జా వరకు, బిర్యానీ నుంచి సలాడ్ వరకు భారతీయుల రుచులు విభిన్నంగా ఉన్నా.. న్యూ ఇయర్ (new year) వేడుకలను మాత్రం అందరూ కడుపునిండా ఆస్వాదించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications