ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ లాక్ డౌన్ సమయంలో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్విగ్గీ ఫుడ్‌ను డెలివరీ చేసే యాప్. లాక్ డౌన్ నేపథ్యంలో హోటల్స్, రెస్టారెంట్లు మూతబడ్డాయి. దీంతో ఈ ఆర్డర్స్ లేవు. ఇప్పటి వరకు ఆర్డర్స్ తీసుకోవడం మానేసింది. తాజాగా మరో రకంగా ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ ఆర్డర్లు ఫుడ్ కోసం కాదు... నిత్యవాసర వస్తువుల కోసం.

లాక్ డౌన్ సమయంలో ఇంటికే నిత్యావసరాలు
కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. మొదట 21 రోజులు.. తాజాగా ప్రధాని మోడీ దీనిని మే 3వ తేదీ వరకు పొడిగించారు. ఏప్రిల్ 20వ తేదీ నుండి కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో కాస్త సడలింపు ఉంటుంది. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలి. బయటకు వెళ్లలేని వారి కోసం స్విగ్గీ కొత్తగా నిత్యావసర సరుకులు ఇంటికే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

గ్రాసరీ సెక్షన్.. నో కాంటాక్ట్ డెలివరీ
దేశంలోని 125 పట్టణాల్లో నిత్యావసరాలను ఇంటికి డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ప్రకటించింది. కస్టమర్లకు సమీపంలోని దుకాణాల నుండి వారికి కావాల్సిన సరుకులు డెలివరీ చేస్తుంది. ఇందుకు యాప్‌లో గ్రాసరీ సెక్షన్‌ను జోడించింది. దీనిపై క్లిక్ చేస్తే మనకు నచ్చిన స్టోర్ నుండి కావాల్సిన సరుకులను 'నో కాంటాక్ట్' డెలివరీ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని నగరాలకు..
రాబోవు కొద్దివారాల్లో సెలక్ట్ చేసిన 125 నగరాల్లో మరిన్ని స్టోర్స్‌ను చేరుస్తామని, స్థానిక అధికారులు అనుమతించిన చోట మరిన్ని నగరాలకు విస్తరిస్తామని స్విగ్గీ తెలిపింది. బ్రాండ్స్, రిటైలర్లతో ప్రత్యక్ష భాగస్వామ్యం కస్టమర్లకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. ఆర్డర్స్ కోసం ధరలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, స్విగ్గీ జీనీ సేవలు 15 నగరాల్లో ఉన్నాయి. దీని ద్వారా మెడిసిన్స్ అందిస్తోంది.

వివిధ బ్రాండ్స్‌తో స్విగ్గీ ఒప్పందం
నిత్యావసర వస్తువుల హోమ్ డెలివరీకి స్విగ్గీ వివిధ బ్రాండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హిందూస్తాన్ యూనీలీవర్, పీ అండ్ జీ, గోద్రేజ్, డాబుర్, విశాల్ మెగా మార్ట్, అదానీ విల్మర్స్, సిప్లాలతో ఆయా నగరాల్లో జత కట్టింది. అందుబాటులోని స్టోర్స్ నుండి సరుకులు ఇంటికి డెలివరీ చేస్తుంది.

ఎప్పటి నుండో ఆలోచన
నిత్యావసరాలను స్విగ్గీలో చేర్చాలని తాము ఎప్పటి నుండో భావిస్తున్నామని, తమ కస్టమర్లకు అధిక ప్రయోజనాలు కల్పించాలని భావించామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందని స్విగ్గీ సీవోవో సుందర్ వివోక్ అన్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తామని, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు కనీస మద్దతు ఇవ్వడమే తమ ఉద్దేశ్యమన్నారు.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications