ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు: భారత్ జపాన్ ల ఆవిష్కరణలకు వేదిక!!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IITH) తన క్యాంపస్‌లో సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ (SIC)ని ప్రారంభించేందుకు సుజుకి మోటార్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శుక్రవారం తెలిపింది.రెండు సంస్థల మధ్య విజ్ఞాన మార్పిడికి వేదికను అందించడం ద్వారా భారతదేశం మరియు జపాన్‌ల కోసం నూతన ఆవిష్కరణలను సృష్టించడం అనే దృక్పథంతో ఈ సంస్థ ఆటోమేకర్‌తో మూడు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసిందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ లో సుజుకి ఇన్నోవేషన్ సెంటర్
పరిశ్రమలు, విద్యాసంస్థలు మరియు స్టార్టప్‌లలో బహిరంగ ఆవిష్కరణల కోసం సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఒక వేదికగా నిర్వహించబడుతుందని, భారతదేశం మరియు జపాన్ మధ్య నైపుణ్యాల అభివృద్ధికి మరియు మానవ వనరుల మార్పిడికి సుజుకి ఇన్నోవేషన్ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐటీ హైదరాబాద్ పేర్కొంది. ఇది రెండు దేశాలలో చలనశీలతపై మరియు అంతకు మించి విస్తృత సవాళ్లను పరిష్కరిస్తుంది అని ఐఐటీ హైదరాబాద్ తెలిపింది.

ఇది సాంకేతికత మరియు డిజైన్ ల సినర్జిస్టిక్ కలయిక : ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్
ఇది సాంకేతికత మరియు డిజైన్ యొక్క సినర్జిస్టిక్ కలయిక అని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి ఎస్ మూర్తి అన్నారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ మరియు ఐఐటి-హెచ్ మధ్య సంవత్సరాల తరబడి సాగిన విజయాల ఫలితంగా సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం భారతీయ మరియు జపనీస్ సమాజాలకు సమగ్ర విలువను సృష్టించడం అని ఆయన పేర్కొన్నారు. భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఐఐటీ-హెచ్ కీలక పాత్ర పోషించడం మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు.

ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ జపాన్ వెలుపల మొదటి ఇన్నోవేషన్ ఇక్కడే
సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటులో భాగంగా, టెక్నాలజీ రీసెర్చ్ పార్క్‌లోని సెంటర్‌కు అవసరమైన సహకారాన్ని ఐఐటీ హైదరాబాద్ అందించింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో సుజుకి ఇన్నోవేషన్ సెంటర్లో వివరణాత్మక కార్యకలాపాలు బహిరంగంగా ప్రారంభించబడతాయని ప్రకటన పేర్కొంది. ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ (SMC) జపాన్, జపాన్ వెలుపల తన మొదటి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ (SIC)ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (IIT-H)లో ఏర్పాటు చేయడం నూతన ఆవిష్కరణలకు వేదిక అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ రీసెర్చ్ పార్క్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన మొదటి విదేశీ కంపెనీ కూడా ఇదే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications