నిత్యావసర వస్తువుల షాక్! కస్టమర్ ఉత్పత్తులను తయారు చేసే హిందూస్తాన్ యూనీ లీవర్(HUL) కంపెనీ సబ్బులు, డిటర్జెంట్ ధరలను పెంచింది. ముడి సరుకు ధరలు పెరగడం, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో వీటి ధరలను మూడు శాతం నుండి ఐదు శాతం మేర పెంచింది. దీంతో సర్ఫెక్సెల్, వీల్, రిన్ డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్, షేర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా వంటి సబ్బుల ధరలు మరింత పెరుగుతున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ ఆయిల్ దిగుమతులపై ప్రభావం పడింది. ముఖ్యంగా సబ్బుల తయారీ కంపెనీలు దాదాపు పామాయిల్‌ను తమ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తాయి. ఈ నేపథ్యంలో HUL ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపుతో సర్ఫెక్సెల్ డిటర్జెంట్ కిలో రూ.130 నుండి రూ.134కు, లక్స్ సోప్ 100 గ్రాముల నాలుగు సబ్బుల కట్ట రూ.160కి, పియర్స్ మూడు సబ్బుల కట్ట రూ.135కి చేరుకుంది. కొన్ని రకాల సబ్బులు, డిష్ వాష్‌లు ఇదివరకే పెరిగాయి. బ్రూ కాఫీ, ీ పొడి ధరలను కూడా సవరిస్తోంది.

హిందూస్తాన్ యూనీలీవర్ దారిలోనే ఇతర కంపెనీలు నడవనున్నాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్భణ ఒత్తిడి కారణంగా ఏడు శాతం మేర ధరలను సవరించే అవకాశముందని సంకేతాలిచ్చింది. ఈ ఏడాది ద్రవ్యోల్భణం మూడు శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తొమ్మిది శాతానికి చేరుకుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications