Banking News: పాపం బ్యాంక్ ఉద్యోగులు.. సుప్రీం కోర్టు గట్టి షాక్.. ఏళ్ల తరబడి పోరాటం వృథా
Supreme Court: ఉద్యోగులు చెల్లించాల్సిన ఆదాయపు పన్నుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుని సవాలు చేసి సుప్రీంను ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో రాయితీపై రుణాలు పొందుతున్న సిబ్బందికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
యజమాని నుంచి రాయితీ వడ్డీ రేటుతో రుణం పొందిన ఉద్యోగులు కచ్చితంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. బ్యాంకు ఉద్యోగులు ఈ పద్ధతిలో లోన్స్ తీసుకోవడం సర్వసాధారణం కాగా వారిపై న్యాయస్థానం నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆదాయపు పన్ను రూల్ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేయాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ నిర్ణయించింది.

జూలై 2007లో ఓ సర్క్యులర్ ద్వారా రిలీజ్ కాబడిన ఫైనాన్స్ యాక్ట్, 2007లో చేసిన సవరణ ఈ సమస్యకు మూలమని తెలుస్తోంది. వారి యజమాని నుంచి పొందే రుణాల వడ్డీ రేటు మరియు SBI ప్రధాన రుణ రేటు మధ్య వ్యత్యాసంపై ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లించాలి. కానీ సాధారణంగా రుణగ్రహీతలు పొందే లోన్లపై వాస్తవ వడ్డీ రేటు కంటే SBI రుణ రేటు గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. ఈ నిబంధనను ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సమాఖ్య 2008లో సవాలు చేసింది.
మద్రాసు హైకోర్టు తీర్పు బ్యాంకు ఉద్యోగులకు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ఈ కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ నిబంధన చెల్లుబాటు అవుతుందని, రాయితీ వడ్డీపై రుణం పొందే పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై ఇది ప్రభావం చూపుతుందని ప్రకటించింది.


Click it and Unblock the Notifications