గురువారం సన్ ఫార్మా స్టాక్ భారీగా పడిపోయింది. ఇంట్రాడే లో దాదాపు 3 శాతం నష్టపోయింది. మే 23 మధ్యాహ్నం 12.15 గంటలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సన్ ఫార్మా స్టాక్ 3.37 శాతం తగ్గి రూ.1,487.40 వద్ద ట్రేడవుతోంది. త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో స్టాక్ పై ప్రెషర్ కనిపించింది. అలాగే ఆదాయ అంచనాను కూడా సింగిలి డిజిట్ కే పరిమితం చేసింది. యూఎస్ సైట్ సమస్యల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని FY25కి సన్ ఫార్మా మేనేజ్‌మెంట్ అధిక సింగిల్-డిజిట్ ఆదాయ వృద్ధిని అంచనా వేసింది.
యూఎస్ లో సన్ ఫార్మా జనరిక్స్ అమ్మకాలు సంవత్సరానికి 2 శాతం వృద్ధిని సాధించాయి. అయినప్పటికీ మొహాలి, హలోల్, దాద్రాలోని దాని ప్లాంట్‌లలో రెగ్యులేటరీ సవాళ్లు ఎదురయ్యాయి. FY25 కోసం సన్ ఫార్మా 8-10 శాతం అమ్మకాలను పరిశోధన, అభివృద్ధి (R&D) కోసం కేటాయించింది. ఇది గత సంవత్సరం 6-7 శాతంగా ఉంది. ముఖ్యంగా నాల్గో త్రైమాసికంలో R&D వ్యయంలో 42 శాతం స్పెషాలిటీ ఉత్పత్తులకు కేటాయించారు.

మేనేజ్‌మెంట్ తన స్పెషాలిటీ ప్రొడక్ట్ Nildegyని జూన్ 3న యూరోపియన్ అధికారులకు ఫైల్ చేయనున్నట్లు తెలిపింది. ఇది GLP-1, మధుమేహం, బరువు తగ్గించే డ్రగ్ ఫార్ములేషన్‌కు ఇన్నోవేటర్ కంపెనీల నుంచి లైసెన్స్ ఇవ్వాలని కూడా భావిస్తోంది. FY24లో సన్ ఫార్మా గ్లోబల్ స్పెషాలిటీ విభాగంలో $1 బిలియన్లకు పైగా అమ్మకాలను సాధించింది. పోటీదారులతో పోల్చితే దాని సన్ ఫార్మాకు అధిక సామర్థ్యం ఉండడం కలిసొచ్చే అంశం. కంపెనీ అభివృద్ధి చేస్తోన్న మెడిసిన్ అందుబాటులోకి వస్తే కంపెనీకి కలిసి రావచ్చు.
మార్చి త్రైమాసికంలో సన్ ఫార్మా రూ.2,654.5 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. లాభం దాని ఇతర ఆదాయంలో 62 శాతం పెరిగింది. ఇది క్రితం సంవత్సరం త్రైమాసికంలో రూ. 373 కోట్లతో పోలిస్తే రూ.606 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో ఆదాయం రూ.11,983 కోట్లుగా ఉంది. గురువారం పవర్ గ్రిడ్ స్టాక్ లో కూడా భారీగా పతనం కనిపించింది. స్టాక్ 3 శాతానికి పైగా పడిపోయంది. త్రైమాసిక ఫలితాలు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో స్టాక్ పై ప్రెషర్ కనిపించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications