Sula Vineyards IPO: రూ.1,400 కోట్ల అంచనాలతో పబ్లిక్ ఇష్యూకు వైన్ కంపెనీ
ముంబై: మహారాష్ట్ర, కర్ణాటకలను కేంద్రంగా చేసుకుని వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోన్న సుల వైన్‌యార్డ్స్.. పబ్లిక్ ఇనిషియల్ ఆఫరింగ్‌ను జారీ చేయనుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను త్వరలో సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు సమర్పించనుంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 1,200 నుంచి 1,400 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్ధించుకుంది.
ఐపీఓ వ్యవహారాలను పర్యవేక్షించడానికి అడ్వైజర్లను సైతం అపాయింట్ చేసుకుందీ సుల వైన్‌యార్డ్స్. కోటక్ మహీంద్ర కేపిటల్స్, సీఎల్ఎస్ఏ, ఐఐఎఫ్ఎల్‌ను నియమించింది. వెర్లిన్‌వెస్ట్, ఎవర్‌స్టోన్ కేపిటల్స్, విస్విర్స్, సామ కేపిటల్స్, డీఎస్‌జీ కన్జ్యూమర్ పార్ట్‌నర్స్ వంటి ఈక్విటీ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్- సుల వైన్‌యార్డ్స్ ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తున్నట్లు కొన్ని తెలుస్తోంది.

బెల్జియంకు చెందిన వెర్లిన్‌వెస్ట్ 2010 నుంచీ సుల వైన్‌యార్డ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తోంది. దశలవారీగా 70 మిలియన్ డాలర్లను ఇందులో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. 1999లో మహారాష్ట్రలోని నాసిక్‌లో సుల వైన్‌యార్డ్స్ ఏర్పాటైంది. 13 బ్రాండ్స్ వైన్‌ను ఉత్పత్తి చేస్తోందీ కంపెనీ. నాసిక్ సహా కర్ణాటక చెన్నపట్టణ సమీపంలోని దొడ్డమాలూర్ వద్ద సుమారు రెండు వేల ఎకరాల్లో వైన్ తయారీ ప్లాంట్ ఉందీ కంపెనీకి. 24 రాష్ట్రాల్లో వైన్ బ్రాండ్స్‌ను సరఫరా చేస్తోంది.

పబ్లిక్ ఇష్యూకు రానుందనే వార్తలపై సుల వైన్‌యార్డ్స్ యాజమాన్యం స్పందించట్లేదని కొన్ని బిజినెస్ వెబ్‌సైట్స్ వెల్లడించాయి. ఈ వార్తలను తోసిపుచ్చట్లేదని, అలాగనీ సమర్థించట్లేదని పేర్కొన్నాయి. బ్యాంకర్స్, ఇతర అడ్వైజర్స్‌ను అపాయింట్ చేసుకోవడం వల్ల సెబికి సమర్పించాల్సిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.


Click it and Unblock the Notifications