మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (Mankind Pharma IPO) 25 ఏప్రిల్ 2023న అంటే వచ్చే వారం మంగళవారం ప్రైమరీ మార్కెట్‌లోకి రాబోతోంది. రూ.4,326.36 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూ 25న ఏప్రిల్ 2023 బిడ్డింగ్ కోసం రానుంది. పబ్లిక్ ఇష్యూ పూర్తిగా అమ్మకానికి లేదా OFSకు చెందినదే. కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1026 నుంచి రూ.1080గా నిర్ణయించారు. IPOలో పాల్గొనాలంటే కనీసం ఒక్క లాట్ కు అప్లై చేయాలి. ఒక్క లాట్ లో 13 షేర్లు ఉంటాయి.
మ్యాన్‌కైండ్ ఫార్మా IPO ప్రారంభానికి ముందు కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లోకి ప్రవేశించాయి. మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఈ రోజు గ్రే మార్కెట్‌లో మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు ఈక్విటీ షేర్‌కు రూ.90 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూ ఏప్రిల్ 25, 2023న ప్రారంభమై 27 ఏప్రిల్ 2023 వరకు తెరిచి ఉంటుంది. మ్యాన్‌కైండ్ ఫార్మా IPO షేర్లు 2023 మే 3న కేటాయిస్తారు. మే 8 షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. మ్యాన్ కైండ్ ఐపీఓకు Kfin టెక్నాలజీస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది.

మ్యాన్‌కైండ్ ఫార్మా FY23 వార్షిక ఫైనాన్షియల్స్‌లో IPO హైయర్ ప్రైస్ బాండ్ వద్ద 32.2x P/E వద్ద ఉందని రిలయన్స్ సెక్యూరిటీస్ పేర్కొంది. మ్యాన్‌కైండ్ ఫార్మా అనేక వర్గాలలో అనేక ప్రముఖ బ్రాండ్‌లను కలిగి ఉందని వివరించింది. ఇది ప్రాథమికంగా దేశీయ ఔషధ మార్కెట్‌పై దృష్టి సారించిందని తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉందని. అయినప్పటికీ, కంపెనీ రెగ్యులేటరీ అధికారుల రాడార్ కిందకు వచ్చిన మెడికల్ రిప్రజెంటేటివ్ లీడ్ సేల్స్ మోడల్‌పై ఎక్కువగా ఆధారపడి ఉందని హెచ్చరించింది.
ప్రస్తుతం ఫార్మా కంపెనీల పనితీరు బాగాలేదు. ఇలాంటి పరిస్థితిల్లో కాస్త ఎక్కువ వాల్యూవేషన్ లో ఐపీఓ వస్తున్నట్లు కనిపిస్తోంది.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నది. వీటిలో పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications