కేంద్రం తీరును నిరసిస్తూ 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు బుధవారం (జనవరి 8) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం వాహన రంగంపై ఎక్కువే పడింది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI), బజాజ్ ఆటోలతో పాటు వివిధ కంపోనెంట్ తయారీదారుల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుండాయ్ మోటార్స్ ఇండియా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.
మానేసర్ ప్లాంటులో మూడు షిఫ్టుల్లో పని చేసే కార్మికులు విధులకు హాజరు కాలేదని, ట్రేడ్ యూనియన్ల సమ్మెకు వారు సంఘీభావం తెలిపారని HMSI ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సురేష్ తెలిపారు. హర్యానాలోని HMSI ప్లాంట్, మహారాష్ట్రలోని బజాజ్ ఆటో చకాన్ యూనిట్, మరికొన్ని ఆటో కంపోనెంట్ తయారీదారుల కేంద్రాల్లో ఉత్పత్తికి బ్రేక్ పడింది.
మహారాష్ట్ర పుణెలోని చకాన్ బజాజ్ ఆటో ప్లాంట్‌లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది పూర్తిగా క్లోజ్ అయిందని ఓ యూనియన్ నాయకుడు వెల్లడించారు. చకాన్‌లోని టాటా, మహీంద్రా ప్లాంట్ల కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. గుర్గావ్, మానేసర్‌లలోని మారుతి సుజుకీ ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి.

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్-అర్గదం పారిశ్రామిక వాడలో మిశ్రమ స్పందన కనిపించింది. దాదాపు మూడు వేల కార్మికులు సమ్మెకు మద్దతిచ్చారు. వాహన విడిభాగాల తయారీ సంస్థలు శివమ్ ఆటోటెక్, ఎమ్కే ఆటో మొబైల్ ఇండస్ట్రీస్, ముంజాల్ షోవా, నాపినో ఆటో అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టాల్ బ్రోస్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
ఐటీ రంగం విషయానికి వస్తే HCL తమ ఉద్యోగులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇంటి నుంచి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications