భౌగోళిక రాజకీయాల కారణాల వల్ల తలెత్తే సరఫరా అంతరాయాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే అంతర్జాతీయ చమురు ధరలు పడిపోయిన సమయంలో పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు నిల్వ చేసే లక్ష్యంలో భాగంగా భారత్ తన ముడి చమురును అమెరికాలోని వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజ్ కేంద్రాల్లో నిల్వ చేసేందుకు సంబంధించిన చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

వ్యూహాత్మక నిల్వలు పెంచేందుకు..
భారత వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు అమెరికా స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్‌లలో ముడి చమురు నిల్వకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. తద్వారా భారత వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకోవడమే మన ఉద్దేశ్యమన్నారు. రెండో యూఎస్-ఇండియా స్ట్రాటెజిక్ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్ (SEP)లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్, అమెరికా ఇంధన కార్యదర్శి డాన్ బ్రౌలెట్ మధ్య వర్చువల్ సమావేశం జరిగింది.

భారత్ నిల్వ సామర్థ్యం ఎంతంటే
వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు జరిగినట్లు చెప్పారు. పునరుత్పాదక, అణు ఇంధనం తదితర వాటిలో సహకారం కుదుర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా అమెరికా మంత్రి తెలిపారు. అమెరికాకు 714 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ సామర్థ్యం ఉందని, భారత్‌లో ఆ సామర్థ్యం 38 మిలియన్ బ్యారెళ్లు అని గుర్తు చేశారు. ఇది భారత అవసరాలకు కేవలం 9.5 రోజులకు మాత్రమే సరిపోతుందన్నారు.

10 రోజులు కాదు.. 90 రోజులు
కాగా, అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ ప్రకారం కనీసం 90 రోజులకు సరిపడా నిల్వలు తమ సభ్యదేశాలు ఉంచుకోవాలి. గత కొన్నేళ్లుగా భారత్ చమురు నిల్వల సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంతో పాటు ఇంధన భద్రతతో కూడిన సహకారం కోసం, మన ఇంధన, ఎనర్జీ రంగాల్లో ఆవిష్కరణ విస్తరణ వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 9.2 బిలియన్ డాలర్లను తాకింది. ఇది మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంలో 10 శాతం కావడం గమనార్హం.

ఇండియా సద్వినియోగం చేసుకుంది..
ఇంటర్నేషనల్ క్రూడ్ ధరలు 2008 జూలైలో బ్యారెల్ 147 డాలర్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ నాటికి 40 డాలర్లకు పడిపోయాయి. ఇటీవల కరోనా నేపథ్యంలోను ఓ సమయంలో క్రూడ్ ధరలు 20 డాలర్లకు పడిపోయాయి. ఇలాంటి సమయంలో మనకు కేవలం 9.5 రోజుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 21న బ్యారెల్ ధర 19.33 డాలర్లకు పడిపోయింది. దీనిని సద్వినియోగం చేసుకున్న ఇండియా కేవలం తమ మూడు చమురు స్టోరేజీలను నింపింది. సగటున బ్యారెల్ ధర 25 డాలర్లకు నింపింది. కానీ స్టోరేజ్ కెపాసిటీ మరింతగా అవసరమని చెబుతున్నారు.
More From GoodReturns

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications