IPO's: ఈ వారం ఐపీఓలతో బిజీగా ఉండనున్న స్టాక్ మార్కెట్లు..
ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్ చాలా బిజీగా ఉండనుంది. ఈ వారంలో నాలుగు ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లు (ఐపిఓలు) రానుండగా.. మరో ఐదు రోజుల్లో ఆరు కంపెనీలు షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి. ఈ వారం ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO మాత్రమే మెయిన్‌బోర్డ్ ఆఫర్‌గా రానుంది. ఈ ఐపీఓ జులై 12 ప్రారంభమై 14న ముగుస్తుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ ప్రైస్ బాండ్ రూ.23 నుంచి రూ.25 గా ఉంది. సంస్థాగత కొనుగోలుదారుల కోసం దాని యాంకర్ బుకింగ్ (QIB) జులై 11న ఒక రోజు పాటు తెరువనుంది. IPOలో 75 శాతం QIBలకు, 15 శాతం, 10 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు రిజర్వ్ చేశారు. భవిష్యత్తు కోసం మూలధనాన్ని సమీకరించడానికి IPO ప్రారంభించాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

మిగిలిన మూడు IPOలు చిన్న, మధ్య తరహా పరిశ్రమల (SMEలు) కంపెనీలకు చెందినవి. జులై 7న యాంకర్ బుక్ ద్వారా రూ. 6 కోట్లకు పైగా సేకరించిన తర్వాత, పాలిమర్ ఆధారిత ప్రొఫైల్ తయారీదారు కాకా ఇండస్ట్రీస్ ఆఫర్ జూలై 10న బిడ్డింగ్‌కు తెరవనుంది. ఒక్కో షేరుకు రూ.55-58 ధరతో రూ.21.23 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఆఫర్ జూలై 12న ముగుస్తుంది.
సోలార్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ అహసోలార్ టెక్నాలజీస్ కంపెనీ రూ. 12.85 కోట్ల ఐపీఓ కూడా జులై 10న ప్రారంభం కానుంది. దీని ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.157గా నిర్ణయించారు. స్టాఫింగ్, అవుట్‌సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ కేర్ IPO జులై 14న ఓపెన్ కానుంది. 30.86 లక్షల షేర్లతో ఐపీఓ ఇష్యూ ధరను ఇంకా నిర్ణయించలేదు.
కోల్‌కతాకు చెందిన ఆభరణాల విక్రయ సంస్థ సెన్‌కో గోల్డ్ జూలై 14న లిస్ట్ కానుంది. ఇది గ్రే మార్కెట్‌లో షేరుకు చివరి ఇష్యూ ధర రూ. 317కి 35 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications