స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 183 పాయింట్లు పెరిగి 71,107 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 21,344 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టాటా మోటర్స్, టాటా స్టీల్, హెచ్ సీఎల్ టెక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, విప్రో, మారుతీ, ఎల్ అండ్ టీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, జెఎస్ డబ్ల్యూ, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, ఎస్బీఐఎన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఐటీసీ, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. డాలర్ ఇండెక్స్ 102 కంటే తక్కువ. US 10-సంవత్సరాల బాండ్ రాబడి 3.9% చుట్టూ ఉండటంతో గ్లోబల్ సంకేతాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి.మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో మితిమీరిన వాల్యుయేషన్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. మిడ్,స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లలోకి రిటైల్ పెట్టుబడులు పెరుగుతోన్నాయి.

మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ అనుబంధ సంస్థకు డ్రగ్స్ & కంట్రోల్ అథారిటీ నుంచి నోటీసులు వచ్చాయి. 5 రోజుల పాటు లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. షరతులను ఉల్లంఘించినందుకు డ్రగ్స్ & కంట్రోల్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. బాటా ఇండియా రిటైల్ & ఫ్రాంచైజీ ఆపరేషన్స్ హెడ్ పంకజ్ గుప్తా ఆ పదవికి రాజీనామా చేశారు.


Click it and Unblock the Notifications