Stock Market : స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...
స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ఉదయం 9 గంటల 24 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 158 పాయింట్లు తగ్గి 72,549 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 22,062 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్ర బ్యాంక్, అల్ట్రాటేక్ సిమెంట్, టైటాన్, ఎల్ అండ్ టీ, హెచ్ డీఎఫ్సీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, విప్రో, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్సా, సన్ ఫార్మా, ఎన్టీపీసీ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
ఐటీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐఎన్, హెచ్ సీఎల్ టెక్, టాటా మోటర్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎంఅండ్ఎం, మారుతి నష్టాల్లో ట్రేడవుతోంది.నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, ఒఎన్‌జిసిలు లాభాల్లో కొనసాగుతోన్నాయి.

కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫిబ్రవరిలో దేశ గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించే కీలకమైన ఖనిజాల వేలంలో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా మూడు బ్లాకులకు వేలం వేయనుందని ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పిఎం ప్రసాద్ సోమవారం తెలిపారు.
మ్యూచువల్ ఫండ్స్ (MF) జనవరిలో ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్‌ల్లో పెట్టుబడులు కొసాగించాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో MF హోల్డింగ్‌లు జనవరిలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 7.58 శాతం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది ఏడాది క్రితం 5.72 శాతంగా ఉంది. జనవరిలో PSU స్టాక్‌లలో 41 మ్యూచువల్ ఫండ్స్‌లో 769 కంపెనీల్లో పెట్టుబడి పెట్టాయి.


Click it and Unblock the Notifications