Stcok Market Open: ఆల్ టైమ్ హైలో ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ..
వారాంతంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీతో సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 204 పాయింట్లు పెరిగి 67,723 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్లు వృద్ధి చెంది 20,159 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో హెచ్ సీఎల్ టెక్, టాటా మోటర్స్, విప్రో, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, జేఎస్ డబ్య్లూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, టాటా స్టీల్, ఐటీసీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎస్బీఐ, మారుతి, ఎల్అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, బజాబ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంకు, టైటాన్, హిందుస్తాన్ యూనిలివర్, ఏసియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ స్టాక్స్ దాదాపు అన్ని పాజిటివ్ లో కొనసాగుతోన్నాయి. టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 3.125 మెగావాట్ల AC గ్రూప్ క్యాప్టివ్ సోలార్ ప్లాంట్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రయోజన వాహనం (SPV) ద్వారా Xpro ఇండియాతో పవర్ డెలివరీ ఒప్పందం (PDA)పై సంతకం చేసింది. దీంతో టాటా పవర్ స్టాక్ పెరుగుదల కనిపిస్తోంది.

విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం 294.69 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, ఎల్‌అండ్‌టి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి బ్లూ చిప్‌ల భాగస్వామ్యం కొనసాగుతున్న ర్యాలీకి దొహదపడింది. మార్కెట్ అండర్ కరెంట్ అధిక వాల్యుయేషన్‌లు బుల్లిష్‌గా ఉన్నప్పటికీ, క్రూడ్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పెరగడం వంటి కొత్త రిస్క్‌లు ప్రభావం చూపుతాయి. గురువారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి.ఇది భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.82 శాతం పెరిగి 94.47 డాలర్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications