శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి ఉదయం 9 గంటల 45 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడి 72758 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 22070 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఏసియన్ పెయింట్స్, యాక్సెస్ బ్యాంక్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, ఇందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతి, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐఎన్, విప్రో, కోటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, టీఎసీఎస్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్ టీ, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) మే మొదటి ఏడు సెషన్లలో ఈక్విటీలలో $2 బిలియన్లకు పైగా నష్టపోయారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ డేటా ప్రకారం మే 2 నుంచి మే 7 వరకు దేశీయ ఈక్విటీలలో ఎఫ్‌ఐఐలు సుమారు $800 మిలియన్లను విక్రయించారు.

మే 8న ఎఫ్‌ఐఐలు రూ. 6,669 కోట్లు, మే 9న రూ. 6,994 కోట్లు ఉపసంహరించుకున్నారు. 2024లో ఇప్పటివరకు దాదాపు $568 మిలియన్లు వెనక్కి తీసుకున్నారు. 2023లో FIIలు $21 బిలియన్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, సిప్లా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ABB ఇండియా, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, కళ్యాణ్ జ్యువెలర్స్, డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్, థర్మాక్స్ శుక్రవారం త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.


Click it and Unblock the Notifications