వరుస లాభాలతో ఉన్న స్టాక్ మార్కెట్లకు శుక్రవారం బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 609 పాయింట్లు నష్టపోయి 73,730 వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 22419 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టాక్ ల్లో ఒత్తిడి కనిపించింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టెక్ మహీంద్రా, విప్రో, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, టాటాస్టీల్, మారుతి, ఎల్అండ్ టీ, ఎస్బీఐఎన్, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, కోటక్ మహీంద్రా బ్యాంకు, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం నష్టపోయాయి. టెక్ మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, ఎల్టీఐమైండ్ ట్రీ, బజాజ్ ఆటో, బీపీసీఎల్ లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంకు, క్యాపిటల్ గూడ్స్ మినహా మిగత ఇండిసెస్ లు గ్రీన్ లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్, రియాల్టీ, మీడియా 0.3 శాతం నుంచి 1 శాతం పెరిగాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది. డాలర్ తో పోలిస్తే రూపాయి రూ.83.34 గా ఉంది. ఇది గురువారం రూ.83.32 గా ఉంది.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0927 GMT వద్ద బ్యారెల్‌కు 19 సెంట్లు లేదా 0.2% లాభపడి $89.20కి చేరుకుంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 25 సెంట్లు లేదా 0.3% పెరిగి $83.82కి చేరుకుంది. ఈ వారంలో బ్రెంట్ 2.2% లాభపడగా, డబ్ల్యూటీఐ 0.8% పెరిగింది.


Click it and Unblock the Notifications