Stock Market End: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
గురువారం స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయిట్లు నష్టపోయి 71,645 వద్ద స్థరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్ల నష్టపోయి 21,689 వద్ద స్థిరపడింది. మారుతి, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐఎన్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. హెచ్ సీఎల్ టెక్, కొటాక్ మహింద్రా బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రియలన్స్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్ టీ నష్టాల్లో ముగిశాయి.
ప్రయాణీకుల భద్రత మరియు సౌకర్యాన్ని పెంపొందించడానికి 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలకు మారుస్తామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మూడు ప్రధాన ఆర్థిక రైల్వే కారిడార్ కార్యక్రమాలు, ఇంధనం, మినరల్, సిమెంట్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లు - కూడా అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ప్రకటన సమీప భవిష్యత్తులో మౌలిక సదుపాయాలు, ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కంపెనీలకు కలిసొచ్చే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు సహాయం అందించడానికి బడ్జెట్ ప్రకటన తర్వాత సౌర సంబంధిత స్టాక్‌ల 5% వరకు లాభపడ్డాయి. నేటి ట్రేడింగ్ సెషన్‌లో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 5% అప్పర్ సర్క్యూట్ తాకింది. రూ. 48.20కి పెరిగాయి. బోరోసిల్ రెన్యూవబుల్స్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్, స్టెర్లింగ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ, టాటా పవర్ 2% పైగా పెరిగాయి.
గురువారం పేటీఎం షేర్లు 20% క్షీణించాయి. వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు మరియు ఇతర సాధనాల్లో డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించడంతో స్టాక్ లో ఫాల్ కనిపిచింది. పేటీఎం బీఎస్ఈలో 20 పడిపోయి లోయర్ సర్క్యూట్ ను తాకింది.


Click it and Unblock the Notifications