సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 344 పాయింట్లు లాభపడి 62,846 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 18,598 వద్ద ముగిసింది. "2025 వరకు $31.4 ట్రిలియన్ల రుణ పరిమితిని నిలిపివేయడం ద్వారా ఆర్థికంగా అస్థిరపరిచే డిఫాల్ట్‌ను నివారించడానికి కాంగ్రెస్ రిపబ్లికన్ మెక్‌కార్తీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ శనివారం అంగీకరించారు. యునైటెడ్ స్టేట్స్ చెల్లించడానికి డబ్బు లేకుండా పోయే ముందు ఒప్పందం ఇప్పుడు ఇరుకైన విభజించబడిన కాంగ్రెస్‌ను క్లియర్ చేయాలి. జూన్ ప్రారంభంలో అప్పులు" అని రాయిటర్స్ నివేదించింది.
దీంతో మార్కెట్లు గ్రీన్ లో ముగిశాయి. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాబ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, బజాబ్ ఫిన్ సర్వ్, టైటాన్, టాటా మోటర్స్, ఎస్బీఐఎన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రియలన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కొటాక్ బ్యాంక్ , ఎన్టీపీసీ, ఎల్&టీ, టాటా స్టీల్, ఐటీసీ, ఎం&ఎం, భారతీ ఎయిర్ టెల్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా,టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్, హెచ్ సీఎల్, హిందుస్థాన్ యూనిలివర్, మారుతి, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి.

ఐసిఐసిఐ లాంబార్డ్‌లో 4 శాతం వాటాను పెంచుకోవాలని ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ షేర్లు ప్రారంభ ట్రేడ్‌లో 11 శాతం ర్యాలీ చేశాయి. ఉదయం 9:37 గంటలకు ఎన్‌ఎస్‌ఇలో ఐసిఐసిఐ లాంబార్డ్ స్టాక్ 11.92 శాతం పెరిగి రూ.1,220 వద్ద ఉంది. ICICI బ్యాంక్ బోర్డు మే 28న జరిగిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో బహుళ లావాదేవీలలో 4 శాతం వాటాను పెంచడానికి ఆమోదించింది.

M&M స్టాక్ దాదాపు 4 శాతం లాభపడింది. మంచి ఫలితాలతో పాటు మోతీలాల్ ఓస్వాల్ ఎంఅండ్ఎంకు టార్గెట్ ప్రైస్ రూ.1500 ఇచ్చింది. దీంతో స్టాక్ లో పెరుదల కనిపించింది. ఎన్డీటీవీ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. ఈ స్టాక్ 5 శాతం పెరిగింది. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు మెటల్ ఇండెక్స్ 1 శాతం వృద్ధితో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. బ్యాంక్ నిప్టీ o.శాతం పెరిగింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications