Stock Market End: బుల్ జోరు.. రికార్డు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆల్ టైమ్ హైని తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1245 పాయింట్లు పెరిగి 73,745 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 344 పాయింట్లు లాభపడి 22,327 వద్ద స్థిర పడింది. నిఫ్టీలో టాటా స్టీల్, ఎల్ అండ్ టి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టైటాన్ కంపెనీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టపోయాయి.
సెక్టార్లలో మెటల్ ఇండెక్స్ 3 శాతం, బ్యాంక్, క్యాపిటల్ గుడ్, ఆయిల్ అండ్ గ్యాస్ 2 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు హెల్త్‌కేర్ ఇండెక్స్ 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించాయి. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్ టీ, టైటాన్,మారుతి, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐఎన్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, ఏసియన్ పెయింట్స్, విప్రో లాభాల్లో ముగిశాయి.

టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. గురువారం నాటి ముగింపు 82.91తో పోలిస్తే భారత రూపాయి శుక్రవారం డాలర్‌కు 82.90 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. హెల్త్ కేర్ స్టాక్ ల్లో రెండు రోజు కూడా ఒత్తిడి కనిపించింది.
కేంద్రం, రాష్ట్రాలు ప్రతిపాదనతో ముందుకు రాకపోతే మధ్యంతర చర్యగా ఆసుపత్రుల్లో సీజీహెచ్‌ఎస్ రేట్లను అమలు చేస్తామని సుప్రీంకోర్టు చెప్పడంతో మాక్స్ హెల్త్‌కేర్, ఆస్టర్ డీఎం, కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ స్టాక్ ల్లో ఒత్తిడి కనిపించింది.గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ (మెదాంత), కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ (కిమ్స్), రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్, నారాయణ హృదయాలయ లిమిటెడ్, హెల్త్‌కేర్ లిమిటెడ్ స్టాక్ లు కాస్త క్షీణించాయి.


Click it and Unblock the Notifications