బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 667 పాయింట్లు కోల్పోయి 74502 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నఫ్టీ 183 పాయింట్లు నష్టోపయి
22704 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఐటీసీ, భారతి ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, మారుతి, టాటా మోటార్స్, జెఎస్ డబ్య్ల్యూ స్టీల్, హెచ్ సీఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్ టీ, ఎంఅండ్ఎం, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఎస్బీఐఎన్, ఇన్ఫోసిస్, రిలయన్స్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా నష్టాల్లో ముగిశాయి.
నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహీంద్రా నష్టపోగా.. హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్ప్, డివిస్ ల్యాబ్స్, నెస్లే మరియు సన్ ఫార్మా లాభపడ్డాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో మిశ్రమ ధోరణి కనిపించింది. క్యాపిటల్ గూడ్స్, టెలికాం, హెల్త్‌కేర్, మెటల్, పవర్ గ్రీన్‌లో ముగియగా, ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి, ఐటి, ఆయిల్ & గ్యాస్ మరియు రియల్టీ 0.3-1 శాతం క్షీణించాయి.

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం పెరిగింది. మూడు సంవత్సరాల పాటు బ్యాంక్ హోల్ టైమ్ డైరెక్టర్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్ విజయ్ ఆనంద్ నియామకానికి సిటీ యూనియన్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందింది. ప్రస్తుతం, ఆర్ విజయ్ ఆనంద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ యొక్క కీలక ప్రమోటర్లలో ఒకటైన బిర్లా గ్రూప్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BGHPL) కంపెనీలో తన వాటాను 19.10% నుండి 23.18%కి పెంచుకుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ద్వారా ఆమోదించడంతో BGHPLతో ఉమంగ్ కమర్షియల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర సంస్థలను విలీనం చేసిన తర్వాత వాటా పెరుగుదల జరిగింది. మంగళవారం ముగింపు 83.18తో పోలిస్తే బుధవారం డాలర్‌కు రూపాయి 16 పైసలు తగ్గి 83.34 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications