చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా వరుసగా మూడవ రోజు స్టాక్ మార్కట్లు నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 518.64 పాయింట్లు నష్టపోయి 61,144.84 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 147 పాయింట్లు క్షీణించి 18,159 వద్ద స్థిరపడింది. చైనాలో కోవిడ్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి.
కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు
చైనాలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు, మరణాల ప్రభుత్వానికి సవాలుగా ఉన్నాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లోని వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ స్టీవ్ బ్రైస్ బ్లూమ్‌బెర్గ్‌తో చెప్పారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో భారతి ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, పవరి గ్రిడ్, టైటాన్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.